రీసెంట్ గానే అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ యంగెస్ట్ బ్యూటీ శ్రీలీల సైతం స్పెషల్ సాంగ్ లో మెరిసిన తీరు అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది . "దెబ్బలు పడతాయి రాజా" అంటూ చాలా చాలా నాటిగా డాన్స్ స్టెప్స్ వేసింది . అయితే ఇప్పుడు అదే లిస్టులోకి వచ్చేస్తుంది అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ జాన్వికపూర్ అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. నిజానికి తెలుగు జనాలకి ఐటెం సాంగ్ అంటే ఒక పెద్ద బూతు . కానీ బాలీవుడ్ లో మాత్రం అది ఒక పెద్ద సెన్సేషన్ .
చాలామంది స్టార్ హీరోయిన్స్ అందరూ ఐటమ్ సాంగ్స్ లో కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. తమ కెరియర్ ని పీక్స్ కి వెళ్లేలా చేసుకున్నారు. కత్రినా కైఫ్ కూడా స్పెషల్ సాంగ్ లో నటించి తన కెరీయర్ ని ఏ విధంగా మలుపు తిప్పుకుందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జాన్వి కపూర్ సైతం స్పెషల్ సాంగ్ లో నటించబోతున్నట్లు ఓ వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సినిమాలో జాన్వి కపూర్ స్పెషల్ సాంగ్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట . తండ్రికి ఇష్టం లేకపోయినా సరే.. జాన్వికపూర్ ఈ నిర్ణయం తీసుకుందట . దీంతో సినిమా ఇండస్ట్రీలో ఈ వార్త బాగా ట్రెండ్ అయిపోతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో..? కొంత మంది జనాలు ఈ డెసీషన్స్ తో జాన్వీ కెరియర్ సంకనాకిపోతాది అంటున్నారు..!