స్టార్ బాయ్ సిద్ధు జొన్నల గడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలలో ఒక్కటి. ఈ సినిమాలో స్టార్ బాయ్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు చేరి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. అలాగే తెలంగాణలో జరిగే పెళ్లి ఎలా ఉంటుందో చూపిస్తూ.. లగ్గం సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
ఇకపోతే 'రజాకార్' సినిమా తెలంగాణ ప్రాంతంలో రజాకార్ వ్యవస్థపై జరిగిన అరాచకాల చూపిస్తుంది తీసిన సినిమా ఇది. రజాకర్ సినిమా దర్శకుడు యాట సత్యనారాయణ. ఈ సినిమా కూడా మంచి టాక్ తో దూసుకెళ్లింది. అలాగే, అనన్య నాగళ్ల మెయిన్ రోల్ లో నటించిన పొట్టేల్ మూవీ కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.
అంతేకాకుండా జితేందర్ రెడ్డి, కేశవ చంద్ర రమావత్ ఉరుకు పటేలా, లైన్ మాన్, కళ్లు కాంపౌండ్, ప్రవీణ్ ఐపీఎస్, పైలం పిలగా, షరతులు వర్తిస్తాయి, గొర్రెపురాణం, బహిర్ భూమి సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించాయి.. కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి. ఇక ఈ సినిమాలు అన్నీ తెలంగాణ నేపథ్యంలో వచ్చిన కథనాలే. ఇక 2025లో కూడా తెలంగాణ నేపథ్యంలో మరిన్ని హిట్ సినిమాలు రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.