ఇండస్ట్రీలో రకరకాల సినిమాలు వస్తున్నాయి. ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చి సక్సెస్ అయితే మరికొన్ని అట్టర్ ఫ్లాఫ్ అయ్యాయి. అయితే కొన్ని సినిమాలు 2024 సంవత్సరంలో హడావిడి చేసి... 2025 సంవత్సరంలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. అలాంటి వారిలో వార్ 2 సినిమా ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే... ఇందులో హృతిక్ రోషన్ తో పాటుపలగురు స్టార్ హీరోలు కూడా నటిస్తున్నారు.

 

ముఖ్యంగా ఈ వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్  మెయిన్ హీరోగా నటిస్తుంటే జూనియర్ ఎన్టీఆర్... కీలక పాత్రలో కనిపించబోతున్నారట. దీంతో ఈ సినిమా పైన మంచి పాజిటివ్ టాక్ నడుస్తోంది. 2019 యాక్షన్ త్రిల్లర్ సినిమా సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో పోషిస్తుంటే హీరోయిన్ గా కియారా అద్వాని... హృతిక్ రోషన్తో రొమాన్స్ చేయబోతున్నారు.

 

ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో యష్ రాజు ఫిలిమ్స్   సంస్థ నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు రెండు సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఫైనల్ దశలో ఈ సినిమా షూటింగ్ ఉంది. మరి కొన్ని సీన్స్ చేస్తే... సినిమా ఫినిష్ అవుతుంది. 2025 ఆగస్టు 14వ తేదీన అంటే పంద్రాగస్టు  సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. యుద్ధం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను అయాన్ ముఖర్జీ  తీస్తున్నారు.

 

ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు జాన్ అబ్రహం  కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో విలన్ అతడే అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం 200 కోట్ల బడ్జెట్ ను ముందు అనుకున్నారు. అయితే ఆ బడ్జెట్ కాస్త మరో 100 కోట్లు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తిగా యాక్షన్ త్రిల్లర్లో వస్తున్న ఈ సినిమా కోసం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉండడంతో తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా దీనిపై ఫోకస్ చేశారు.. మరి ఈ సినిమా వచ్చే సంవత్సరం రిలీజ్ అయి ఏమైనా సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: