అయితే అల్లు అర్జున్ ఆ తర్వాత చాలా పక్కాగా తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు . ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా తన సినిమాలకు ఎలాంటి న్యాయం చేయాలి అనే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు . కొన్ని సీన్స్ కి డబ్బింగ్ కూడా చెప్పారు . అయితే పుష్ప2 సినిమా హిట్ అయిన కారణంగా పలు స్టేట్స్ లో సక్సెస్ ఫంక్షన్స్ సెలబ్రేట్ చేయాలి అంటూ డిసైడ్ అయింది మూవీ టీం. ముందుగా ముంబైలో పుష్ప2 సక్సెస్ మీట్ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు .
కానీ అనుకోకుండా అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం.. ఆ తర్వాత బెయిల్ పై బయటకు రావడం .. ఆయన కండిషన్ బెయిల్ పై ఉండడంతో స్టేట్ దాటే ఛాన్స్ లేకుండా పోయింది . అయితే ఇప్పుడు పుష్ప2 మేకర్స్ అల్లు అర్జున్ లేకుండా నే సక్సెస్ మీట్ నిర్వహించాలి అంటూ ఫిక్స్ అయిపోయారట . అల్లు అర్జున్ లేకపోతే ఏం..? రష్మిక మందన్నా ఉంది..డైరెక్టర్ సుకుమార్ ఉన్నాడు.. వాళ్లని తీసుకొని మనం సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొంటాం ..ఇంకా సినిమా కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది ..అల్లు అర్జున్ ని విర్చువల్ గా వీడియో రూపంలో ఆ ఈవెంట్ లో మాట్లాడుతాడు అంటూ పుష్ప2 మేకర్స్ నిర్ణయం తీసుకున్నారట. ఇది నిజంగా అల్లు అర్జున్ కి ఘోర అవమానం అంటూ చెబుతున్నారు బన్నీ ఫ్యాన్స్. అల్లు అర్జున్ హార్డ్ వర్క్ కారణంగానే సినిమా ఇంత హిట్ అయింది . ఇప్పుడు ఆ అల్లు అర్జున్ లేకుండానే సక్సెస్ సెలబ్రేషన్స్ చేసేస్తారా ..? అంటూ ఫైర్ అయిపోతున్నారు . ఇలాంటి ఇన్సల్ట్ జన్మలో మర్చిపోలేరు ఎవరు అంటూ ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు..!