సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువ శాతం మంచి విజయాలు అందుకుంటున్న హీరోయిన్స్ కి క్రేజీ ఆఫర్స్ వస్తూ ఉంటాయి. అదే దశలో మంచి విజయాలు దక్కని ముద్దు గుమ్మలకు అవకాశాలు పెద్దగా రావు. ఇకపోతే దాదాపుగా ఒకే సమయంలో కెరియర్ను మొదలు పెట్టిన ఇద్దరు ముద్దుగుమ్మలు వారి కెరియర్ లో రెండవ సినిమాలో కలిసిన నటించారు. ఇక ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన వారిద్దరూ అందులో అద్భుతమైన అందాలను ఆరబోసి కుర్ర కారు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఒక బ్యూటీ కి వరుస పెట్టి క్రేజీ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తే , మరో ముద్దు గుమ్మ కు మాత్రం అవకాశాలే కరువయ్యాయి. మరి వారు ఎవరు అనేది తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో డింపుల్ హయాతి , మీరాక్షి చౌదరి కూడా ఉంటారు. డింపుల్ హయాతి "గద్దల కొండ గణేష్" సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది. మీనాక్షి చౌదరి "ఇచ్చట వాహనములు" నిలపరాదు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన కిలాడి సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ మూవీ లో వీరిద్దరూ ఒకరిని మించిన స్థాయిలో మరొకరు అందాలు ఆరబోశారు. ఇక ఈ మూవీ ద్వారా వీరిద్దరికి మంచి గుర్తింపు వచ్చింది.

కానీ ఈ సినిమా తర్వాత డింపుల్ హయాతి కి పెద్ద స్థాయిలో అవకాశాలు రాలేదు. కానీ కిలాడి మూవీ తర్వాత మీనాక్షి చౌదరి కి మాత్రం వరుస పెట్టి క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కాయి. దానితో డింపుల్ హయాతి కి పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఫుల్ స్లో గా కెరియర్ను ముందుకు సాగిస్తూ ఉంటే మీనాక్షి చౌదరి మాత్రం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: