ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరిగింది. గతంలో పలు ఫ్యామిలీ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్న దిల్ రాజు ఈ సినిమాతో కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. అటు గేమ్ ఛేంజర్ ఇటు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో దిల్ రాజు సంచలనాలు సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం కథ మరీ కొత్త కథ కాదని అయితే కథనంలో ప్రత్యేకతలు ఉంటాయని సమాచారం అందుతోంది. నిర్మాత దిల్ రాజు సంక్రాంతి సినిమాలతో సక్సెస్ అందుకుంటే ఆయన జాతకం మారుతుందని చెప్పవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.
స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గత సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమాలో మరింత అందంగా కనిపిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ సాధించడం హీరో వెంకటేశ్ కు కూడా కీలకమనే సంగతి తెలిసిందే. 2025 సంక్రాంతికి మూడు సినిమాలే రిలీజ్ అవుతుండగా బడ్జెట్ కలెక్షన్ల విషయంలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలి. వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ సంక్రాంతి విజేతగా నిలిస్తే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.