మెగా కుటుంబం నుంచి చిరంజీవి వారసులుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా పరిశ్రమలోకి ప్రవేశించిన బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారారు. అలాగే రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారారు. అయితే వీరిద్దరి మధ్య విభేదాలున్నాయని కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మెగా కుటుంబానికి అల్లు అర్జున్ దూరం జరిగారని, అందుకు కారణం ఏమిటనే విషయం బయటకు రావాల్సి ఉందంటున్నారు.తాజాగా అల్లు అర్జున్, రామ్ చరణ్ అభిమానుల మధ్య మరోసారి సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ అండతోనే ఇండస్ట్రీకి వచ్చిన అల్లు అర్జున్ స్టార్ హీరోగా అవతరించిన తర్వాత అల్లు ఫ్యామిలీ అంటూ సపరేట్ గా తనకంటూ ఒక ట్యాగ్ తగిలించుకున్నాడు.

మరి ఏది ఏమైనా కూడా ఈ రెండు ఫ్యామిలీల మధ్య మంచి సన్నిహిత సంబంధాలైతే ఉంటూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు వీళ్ళ మధ్య ఉన్న బాండింగ్ తెలియజేస్తూ ఎవరికి వాళ్లు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ ప్రేమను చూపిస్తూ మేమంతా ఒక్కటే అని చాటి చెబుతూ ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి లాంటి డ్యాన్స్ చేయగలిగే కెపాసిటీ ఉన్న నటులు కొంతమంది మాత్రమే ఉన్నారు. అందులో రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇద్దరూ ఉంటారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్ అనే దాని మీద చాలా రోజుల నుంచి చాలా ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి.

మరి ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరూ వాళ్ళ గ్రేస్ కి తగ్గట్టుగా బాగా డాన్స్ చేస్తూ ఉంటారు. అందువల్ల వీళ్ళలో ఎవరు బెస్ట్ ఎవరు అనే విషయాన్ని మనం చెప్పలేము… ఎందుకంటే ఎవరి స్టైల్ లో వాళ్లు పర్ఫెక్ట్ మూమెంట్స్ వేస్తూ ప్రేక్షకులను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్లలో ఎవరు నెంబర్ వన్ అనేది మనం పర్ఫెక్ట్ గా చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని అనే చెప్పాలి.ఇదిలావుండగా బన్నీకి, చెర్రీకి పడటంలేదంటున్నారుకానీ వాస్తవానికి వీరిద్దరూ ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ వెళుతున్నారు. సందర్భాలు ఎదురైనప్పుడు, వేడుకలప్పుడు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో వీరిద్దరూ కలిసిన సందర్భం కూడాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: