నటి కస్తూరి శంకర్ ఒకప్పుడు సినిమాలతో, ఇప్పుడు సీరియల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈమె తెలుగుతో పాటు తమిళం, మలయాళం మరియు కన్నడ భాషా చిత్రాలలో కూడా కనిపించింది. ఈమె ఒక్కప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్లింది. ఇప్పుడు స్టార్ మా లో ప్రసారం అయ్యే 'ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్ తో ప్రేక్షకుల మరింత దగ్గరైంది. ఈ సీరియల్ ద్వారా బుల్లితెరపై మంచి ఇమేజ్ ని సంపాదించుకుంది. అయితే కస్తూరి శంకర్ నిత్యం వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది.
ఇటీవల ఈమె ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ లోని పలు విషయాలను వెల్లడించింది. 'రాత్రి 9 దాటితే ఉవ్విల్లూరుతాను. ఆ కోరికను వద్దు అని నాకు నేను చెప్పుకున్న కూడా చెయ్యకుండా ఆగలేకపోతున్నాను. అప్పుడప్పుడు ఆ కోరిక తీర్చుకోవడానికి నేను లొంగిపోతున్నాను. కొన్నిసార్లు తెల్లవారగానే దాన్ని తలుచుకుని గిల్టీగా ఫీల్స్ అవుతున్నాను. మరోసారి దాన్ని జోలికి వెళ్లొద్దని భావిస్తాను కానీ ఆ కోరికను తీర్చుకోకుండా ఉండలేకున్నా' అని కస్తూరి చెప్పింది. ఆ కోరిక ఏంటంటే తనకి తొమ్మిది దాటితే ఆలు చిప్స్ తినాలని అనిపిస్తుందట.. ఉదయం లేచి ఎందుకు తిన్నా అని ఫీల్ అవుతుందట. ఇక ఈ కోరిక విన్న నెటిజన్స్ ఇదేం వింత కోరిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే ఈమె ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. కస్తూరి తల్లిదండ్రులు సుమతి, న్యాయవాది శంకర్‌. ఈమెకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. కస్తూరి ఇతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి గ్రాడ్యుయేషన్ తర్వాత, 1992లో మిస్ చెన్నైగా గెలుపొందింది. అదే సంవత్సరంలో, కస్తూరి ఫెమినా మిస్ మద్రాస్ అందాల పోటీని కూడా గెలుచుకుంది. కాలేజీలో చదువుతున్నప్పుడు, కస్తూరి డొమైన్‌పై ఆసక్తితో మోడలింగ్‌లో తన వృత్తిని ప్రారంభించింది. కస్తూరి శంకర్ నటన జీవితం 1991లో ఆతా ఉన్ కోయిలీలే చిత్రంతో ప్రారంభమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: