అయితే 1 నేనొక్కడినే సినిమా ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించినా కమర్షియల్ గా ఈ సినిమా అంచనాలను అందుకోలేదు. ఈ సినిమా రిజల్ట్ తర్వాత సినిమాలు ఆపేయాలని అనుకున్నానని సుకుమార్ చెబుతున్నారు. అయితే 1 నేనొక్కడినే ఫ్లాపైనా నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప, పుష్ప2 సినిమాలు దర్శకుడిగా సుకుమార్ స్థాయి ఏంటో చెప్పకనే చెప్పేశాయి. పుష్ప2 బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో హిట్ గా నిలిచింది.
నిర్మాతలకు సైతం ఈ సినిమా అంచనాలకు మించి లాభాలను అందించింది. సుకుమార్ ఒకవేళ సినిమాలకు గుడ్ బై చెప్పి ఉంటే మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక మంచి దర్శకుడిని మిస్ అయ్యేది. ఒకప్పుడు లెక్చరర్ గా పని చేసిన సుకుమార్ తన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేశారని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు.
దర్శకుడు సుకుమార్ పారితోషికం కూడా ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. సుకుమార్ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా 1000 కోట్ల బొమ్మ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సుకుమార్ చరణ్ తో ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండతటం హాట్ టాపిక్ అవుతోంది.