•వచ్చే ఏడాది వరుస చిత్రాలతో బిజీ..

•2025 లో ఆ స్థానం సంపాదించుకోనున్న ఘాటీ

•భారీ అంచనాలతో ఘాటి ప్రేక్షకుల ముందుకు..


టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి గత కొద్ది నెలలుగా సినిమాలకు దూరంగా ఉండడంతో త్వరలోనే వివాహం చేసుకోబోతోందనే రూమర్స్ కూడా ఎక్కువగా వినిపించాయి.. అంతేకాకుండా మధ్యలో అనుష్క కాస్త బరువు పెరగడంతో ఈమె మీద చాలా దారుణంగా ట్రోల్స్ కూడా వినిపించాయి. ఇలాంటి సమయంలోనే అనుష్క రెండు విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. అందులో డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఘాటీ సినిమా కూడా ఒకటి.  ఈ సినిమా ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కించారు. ఇందులో అనుష్క చాలా విభిన్నమైన పాత్రలో నటిస్తున్నట్లు ఇటీవలే పోస్టర్, గ్లింప్స్ విడుదల చేయగా.. ఆడియన్స్ లో అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.



సినిమా షూటింగ్ ఈ ఏడాది మొదలుపెట్టగా.. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతోంది చిత్ర బృందం. ఇప్పటికీ 80% వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నదట. ప్రస్తుతం ఘాటీ సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందట. ఇక వచ్చే షెడ్యూల్ లో కూడా ఈ సినిమా క్లైమాక్స్ ని షూట్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. డైరెక్టర్ క్రిష్ కూడా ఈ సినిమా క్లైమాక్స్ కోసం చాలా విభిన్నంగా ఆలోచిస్తున్నారని,  ఇది పూర్తి అయిన వెంటనే అనుష్క తన పాత్రకు కూడా డబ్బింగ్ చెప్పబోతోందని సమాచారం.


జనవరి 2025 ఎండింగ్ లో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత అనుష్క మలయాళం లో కూడా ఒక సినిమాలో నటిస్తోంది. కథానర్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నది. ఇదే కాకుండా భాగమతి-2 చిత్రంలో కూడా నటించబోతోంది అనుష్క. మొత్తానికి ఘాటి షూటింగ్ తర్వాత ఈ రెండు చిత్రాలను పూర్తి చేసే పనిలో పడ్డది. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ ఓటిటి హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ చేయబోతున్నారట. ఏదేమైనా వచ్చే ఏడాది భారీ అంచనాలున్న చిత్రంగా ఘాటి నిలవబోతోంది.  అంతేకాదు ఈ సినిమా భారీ సక్సెస్ అవుతుందని, 2025 అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల జాబితాలో కచ్చితంగా నిలుస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: