స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి హీరో వెంకటేష్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం .. ఈ మూవీలో వెంకీకి జంటగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు .. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి ... ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు .. ఇక ఈ షోలో వెంకటేష్ తో పాటు నిర్మాత సురేష్ బాబు , దర్శకుడు అనిల్ రావుపూడి , ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి కూడా సందడి చేశారు .. ఇక డిసెంబర్ 27 నుంచి ఈ ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది .... ఇదే క్రమంలో బాలయ్య అడిగిన పలు ప్రశ్నలకు వెంకీ చెప్పిన సమాధానాలు కూడా అందరికీ మంచి కిక్ ఇచ్చాయి.


అయితే ఈ కార్యక్రమంలో చాలా అంశాల గురించి చెప్పుకొచ్చారు వెంకటేష్ .. ప్రధానంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తన రిలేషన్ ఎలా ఉంటుందని కూడా బాలయ్య అడగగా.. వెంకటేష్ మాట్లాడుతూ సినిమాల కంటే ముందే పవన్ తో నాకు పరిచయం ఉంది .. పవన్ మా ఇంటికి ఎక్కువగా వచ్చేవాడు అప్పట్లో నా దగ్గర లేజర్ డిస్కులు ఉండేవి వాటి కోసమే పవన్ మా ఇంటికి వచ్చేవాడు .. ఆ సమయంలో మేమిద్దరం భక్తి భావంతో బాగా కనెక్ట్ అయ్యాం . ఇక ఇద్దరికీ భక్తి ఎక్కువ ఇద్దరం ఎక్కువ సైలెంట్ గా ఉంటాము .. ఆ సైలెంట్ లోనే ఒకరికి ఒకరు అర్థం చేసుకుంటామని చెప్పు వచ్చారు.


అదేవిధంగా మహేష్ బాబు గురించి కూడా మాట్లాడుతూ.. రీసెంట్ గానే మహేష్ కి మెసేజ్ చేశాను పూలకుండీ ఎందుకు తన్నావు అని కానీ ఇప్పటికీ రిప్లై రాలేదు .. మహేష్ అందరికీ ఎంతో గౌరవం ఇస్తాడు ఆ సినిమా సమయంలో ఒకరికి ఒకరు బాగా దగ్గరయ్యాం .. అలాగే నిజమైన అన్నదమ్ముల్లాగే కలిసి చేసాము .. ఇప్పుడు కూడా  కలవకపోయినా ఎప్పుడన్నా కలిస్తే నా చిన్న తమ్ముడిలా భావిస్తాను.. ప్రెసెంట్ వెంకటేష్ , పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు గురించి చెప్పిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి .. వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకు ముందుకు రానుంది .. మరి ఈ సినిమాతో వెంకటేష్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: