స్టార్ హీరోలంతా హోస్టులుగా మారి ఎంటర్‌టైన్ చేయడం ట్రెండ్‌గా మారిపోయింది. కానీ ఈ లిస్ట్‌లోకి బాలయ్య వస్తారని చాలామంది ప్రేక్షకులు ఊహించలేదు.ప్రస్తుతం బాలకృష్ణ సైతం హోస్ట్‌గా ఒక టాక్ షో ప్రసారమవుతోంది. అదే 'అన్‌స్టాపబుల్'. ఇప్పటివరకు ఈ టాక్ షో మూడు సీజన్స్ పూర్తి చేసుకొని 4వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. 'అన్‌స్టాపబుల్ 4' కొన్నాళ్ల క్రితమే ప్రారంభమయ్యి మంచి ఆదరణ సంపాదించుకుంటోంది. ఇప్పటికీ ఈ షోలోకి ఎంతోమంది స్టార్ హీరోలు, అందమైన హీరోయిన్లు వచ్చారు. ఇక త్వరలోనే ఈ స్టేజ్‌పై రామ్ చరణ్‌ను చూడబోతున్నాం. 'గేమ్ చేంజర్'తో కలిసి త్వరలోనే బాలయ్య అల్లరి చేయనున్నారు.'అన్‌స్టాపబుల్'లో గెస్టులుగా పాల్గొనడానికి బాలయ్య పిలిస్తే రాని హీరోలు లేరు. అందుకే పాన్ ఇండియా స్టార్ల దగ్గర నుండి బాలీవుడ్ హీరోల వరకు చాలామంది ఈ టాక్ షోలో గెస్టులుగా వచ్చారు. పాన్ ఇండియా ప్రభాస్ సైతం ఈ టాక్ షోకు వచ్చి ఎంటర్‌టైన్ చేశాడు. ఆ ఎపిసోడ్‌లో రామ్ చరణ్‌కు కాల్ చేసి మరీ తన టాక్ షోకు రమ్మని ఆహ్వానించారు బాలయ్య. అప్పుడు తప్పకుండా వస్తానని మాటిచ్చాడు చరణ్. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ చేంజర్' మూవీ విడుదలకు సిద్ధమయ్యింది.

సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసమే హీరో మాత్రమే కాదు.. మొత్తం టీమ్ అంతా ఈ టాక్ షోకు రానుంది.దాదాపు మూడేళ్లుగా 'గేమ్ చేంజర్'సినిమా మేకింగ్‌లో ఉంది. ఫైనల్‌గా ఎన్నోసార్లు షూటింగ్ క్యాన్సెల్ అయ్యి, వాయిదా పడిన తర్వాత జనవరి 12న ఈ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాకు ఇంకా పూర్తిస్థాయిలో ప్రమోషన్స్ ప్రారంభం కాలేదు. మ్యూజికల్ ప్రమోషన్స్ మాత్రమే ఫుల్ స్పీడ్‌లో ప్రారంభమయ్యాయి. అందుకే 'గేమ్ చేంజర్' ప్రమోషన్స్ కోసం 'అన్‌స్టాపబుల్' షోనే కరెక్ట్ అని అనుకున్నారు మేకర్స్. ఈ షోలో ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్  మాత్రమే కాదు దర్శకుడు శంకర్, హీరోయిన్ కియారా అద్వానీ  కూడా రానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ కోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.డిసెంబర్ 31న 'అన్‌స్టాపబుల్'లో 'గేమ్ చేంజర్' స్పెషల్ ఎపిసోడ్ కోసం షూటింగ్ జరగనుందనే వార్త బయటికొచ్చింది. సినిమాకు ఇంకా కొన్నిరోజులే ఉన్నా ఇప్పటికీ ఈ మూవీ నుండి ట్రైలర్ కూడా విడుదల కాలేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ట్రైలర్ విడుదల చేస్తారా లేదా ఎప్పుడు విడుదల చేస్తారు అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకే న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ వస్తుందని నమ్మకంతో ఉన్నారు. అదే సమయంలో 'అన్‌స్టాపబుల్' స్పెషల్ ఎపిసోడ్ కూడా విడుదల చేస్తే తమకు డబుల్ ట్రీట్ ఇచ్చినట్టుగా ఉందని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: