అరుణాచలం ఆలయం సందర్శించిన తర్వాత తనకు కలిగిన అనుభూతిని వెంకటేష్ ఇలా పంచుకున్నారు. 'ప్రపంచంలో చాలా ప్రదేశాలు తిరిగాను. ఈ క్రమంలో చాలామందిని కలిశాను. ఈ క్రమంలో జీవితంలో కూడా చాలా డిస్ట్రబ్ అయ్యాను కూడా. ఫైనల్లీ అరుణాచలం వెళ్లి స్వామి దర్శనం అనంతరం స్కందాశ్రమంలో మెడిటేషన్ చేశాను. అక్కడ ఏదో తెలియని శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. అసలైన హ్యూమన్ ఎనర్జీ ఎంటో అక్కడే తెలుస్తోంది. నేను అలాంటి శక్తిని అక్కడి నుంచే పొందాను. ఆ తర్వాత నా జీవితంలో ఎలాంటి సంఘటన కూడా నున్ను డిస్ట్రబ్ చేయలేకపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న వెంకీలోని మార్పులు అరుణాచలం నుంచి వచ్చినవే. ఎక్కడ దొరకని ప్రశాంతత అక్కడ ఉంటుంది. అలానే నేను అన్నది మర్చిపోయి , ఏది శాశ్వతము కాదు అని తెలుసుకుంటాము ' అని ఆయన భక్తితో ఎమోషనల్‌గా చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఇక ప్రస్తుతం వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 14న విడుదలకానుంది. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు.