కొత్త సంవత్సర సెలబ్రేషన్ వస్తున్నాయంటే చాలు మూడు నాలుగు రోజుల ముందే తమకి ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళిపోతుంటారు స్టార్స్ .. అయితే ఎక్కువ మంది ప్రైవ‌సీ కోసం విదేశాలకు వెళ్ళిపోతారు .. ప్రతి సంవత్సరం జరిగే తంతు ఇదే .. అయితే ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మాత్రం కొంతమంది హీరోలు చాలా మిస్ అవుతున్నారు.. ఉదాహరణకు ప్రభాస్ నే తీసుకోండి .. ఈ పాన్ ఇండియా హీరో రీసెంట్గా షూటింగ్లో గాయపడ్డాడు .. ఆ గాయం వల్ల జపాన్ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు .. గాయం నుంచి త్వరగానే కోలుకుంటున్నాడు కానీ కొత్త సంవత్సరం సంబరాలు కోసం విదేశాలకు వెళ్లేంత‌ సీన్ లేదు ఏం చేసినా అంతా ఇంట్లోనే. రామ్ చరణ్‌ది ఊహించని మరో బాధ .. ఈ హీరోకి తన ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ఉంది కానీ గేమ్ ఛెంజర్ ప్రమోషన్స్ గట్టిగా ఉన్నాయి .. మరో 12 రోజుల్లో ఈ సినిమా రిలీజ్ పెట్టుకుని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఎక్కడికి వెళ్లలేరు .. అందుకే క్రిస్మస్ ను కూడా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాడు. అలాగే డిసెంబర్ 31 రాత్రి కూడా ఇంట్లోనే ఉండబోతున్నాడు.


పైన చెప్పిన ఇద్దరికంటే భిన్నమైనది అల్లు అర్జున్ బాధ .. ప్రతి సంవత్సరం అల్లు అర్జున్ న్యూ ఇయర్ వేడుకల్ని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు .. కానీ ఈసారి అత‌నును ఈ వేడుకలు చేసుకోపోవచ్చు.. సంధ్య థియేటర్ ఘటనలో అతను నిందితుడిగా ఉన్నాడు .. పోలీస్ విచారణతో పాటు కోర్ట్ కేసు కూడా నడుస్తుంది .. ఇప్పుడు మీడియా అంతా అల్లు అర్జున్ పైన ఫోకస్ పెట్టిన వేళ అంత పెద్ద దుర్ఘ‌ట‌న‌ తర్వాత తాను సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్తే తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి అల్లు అర్జున్ కూడా ఇంట్లోనే. మిగతా హీరోల విషయానికొస్తే.. ఎన్టీఆర్ ఇప్పటికే లండన్ వెళ్లిపోయాడు .. తన ఫ్యామిలీతో పాటు అక్కడికి వెళ్లిన ఎన్టీఆర్ న్యూ ఇయర్ వేడుకలను కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు .. ఇప్పటికే లండన్ వీధిలో ఎన్టీఆర్ ఎంజాయ్ చేస్తున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్ టైం కు యంగ్ టైగర్ ఎక్కడ ఉంటాడో చూడాలి.


అలాగే సమయం దొరికితే విదేశీ పర్యటన చేయడానికి ఇష్టపడే మహేష్ కూడా ఈసారి న్యూ ఇయర్ వేడుకలను గట్టిగానే ప్లాన్ చేశాడు.. ఇప్పటికే త‌న భార్య న‌మ్ర‌తా తో పాటు పిల్లలంతా స్విట్జర్లాండ్ వెళ్లిపోయారు.. త్వరలోనే మహేష్ కూడా వాళ్లతో జాయిన్ అవ్వబోతున్నాడు.. ఇక నాగ చైతన్య కూడా ఈసారి న్యూ ఇయర్ ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు .. ఎందుకంటే అతను కొత్తగా పెళ్లి చేసుకున్నాడు తన భార్య శోభితతో కలిసి ఈ  హీరో ఎక్కడ ల్యాండ్ అవుతాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్షన్ .. సెలబ్రేషన్స్ మాత్రం పక్క .. అలాగే మరో హీరో రానా కూడా ముంబైలో ఓ ప్రైవేట్ పార్టీకి హాజరబోతున్నాడు .. హీరోయిన్ల విషయానికొస్తే రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే తన భ‌ర్త‌తో కలిసి లండన్ వెళ్ళిపోయింది.. ఇక వీరితోపాటు ముంబైలో మనుష్ మల్హోత్రా ఇచ్చే న్యూ ఇయర్ పార్టీకి హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ , అనన్య పాండే కూడా హాజరు కాబోతున్నారు .. ఇక హైదరాబాద్ నోవా హోటల్ లో జరగనున్న సెలబ్రేషన్స్ కు హీరోయిన్ శ్రీలీల‌ స్పెషల్ గెస్ట్ గా రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: