ఇక దివంగత సౌందర్య తర్వాత ఇండస్ట్రీలో ఆ స్థాయి పేరు తెచ్చుకున్న హీరోయిన్ మన అనుష్క .. కెరియర్ మొదట్లో గ్లామర్ పాత్రలో అదరగొట్టిన ఆ తర్వాత తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలలో సోలో హీరోయిన్గా అదరగొట్టింది .. తెలుగు నాట లేడీ సూపర్ స్టార్ గా చలామణి అయింది . కానీ సైజ్ జీరో సినిమా తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు ఈ బ్యూటీ . సంవత్సరానికి రెండేళ్లకు ఓ సినిమాతో పలకరిస్తుంది . ఇక చివరగా 2023 లో మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. ఇక ప్రస్తుతం అనుష్క రెండు తెలుగు సినిమాలతో పాటు ఓ మలయాళ సినిమాల్లో కూడా నటిస్తుంది .
కాగా అనుష్క సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండరు .. ఇంస్టాగ్రామ్ లో 7 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు .. అయితే ఆమె మాత్రం కేవలం 12 మందిని ఫాలో అవుతున్నారు .. అయితే అందులో తెలుగు హీరోలు ఇద్దరంటే ఇద్దరే ఉన్నారు .. ఇంతకీ వారు మరెవరో కాదు ప్రభాస్ , రానా.. ఇక వీరితో పాటు పీవీ సింధు , క్రితి శెట్టి , రాజమౌళి , కాజల్ అగర్వాల్ ,దుల్కర్ సల్మాన్ వంటి వారిని కూడా అనుష్క ఫాలో అవుతున్నారు .. కాగా 45 సంవత్సరాలు దాటుతున్న ఇప్పటికీ పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు ఈ సూపర్ బ్యూటీ.