మీనాక్షి చౌదరి ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్న హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు.ఈ ఏడాది లక్కీ భాస్కర్,ది గోట్ వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఈ హీరోయిన్ నటించింది. అయితే ఈ హీరోయిన్ ఖాతాలో బ్లాక్ బస్టర్ సినిమాలే కాదు రెండు దారుణమైన ఫ్లాప్ లు కూడా పడ్డాయి. అదే మట్కా,మెకానిక్ రాకి.. ఈ రెండు సినిమాల్లో మట్కా మూవీ అయితే అతి పెద్ద డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఒక హీరోయిన్ కి రెండు వరస ఫ్లాప్ లు పడితే కచ్చితంగా సినీ ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు తగ్గిపోతాయి. కానీ ఆశ్చర్యం కలిగించేలా మీనాక్షి చౌదరికి చేతి నిండా వరుస సినిమాలు వస్తున్నాయి. అయితే మీనాక్షి చౌదరి నటించిన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆమెకు వరుస సినిమాల్లో ఆఫర్స్ రావడానికి కారణం ఓ హీరో ఉన్నారట.

ఆమెకి ఆఫర్స్ రావడం వెనుక ఓ యంగ్ హీరో హస్తము ఉన్నట్టు వార్తలు టాలీవుడ్ లో జోరందుకున్నాయి. అయితే ఆ టాలీవుడ్ హీరో తో ఎఫైర్ వల్లే మీనాక్షి చౌదరికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి అనే రూమర్ టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. మీనాక్షి చౌదరి నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ జనవరి 14న విడుదల కాబోతుంది. అలాగే రీసెంట్ గా నవీన్ పొలిశెట్టితో అనగనగా ఒక రాజు సినిమాలో కూడా హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు అఫీషియల్ ఆనౌన్స్మెంట్ వచ్చేసింది.

అయితే ఈ సినిమాలో ముందుగా శ్రీలీలను అనుకున్నప్పటికీ ఆమె తప్పుకోవడంతో ఈ అవకాశం మీనాక్షి చౌదరికి వచ్చింది.అలాగే విశ్వంభర లో కూడా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేస్తుంది.. ఇలా వరుస ఆఫర్స్ ఈ హీరోయిన్ కి ఇంటికి తలుపు తట్టడం వెనుక ఆ హీరో హస్తం ఉందని,ఆ యంగ్ హీరో రికమెండ్ చేయడం వల్లే మీనాక్షి చౌదరికి ఆఫర్స్ వస్తున్నట్టు టాలీవుడ్ సినీ వర్గాలో రూమర్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: