టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో హీరోలుగా విలన్ గా రానిస్తున్నారు .. అయితే వారిలో శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన ఢమరుకం సినిమా ఒకటి .. 2012లో ఈ సినిమా విడుదలైంది ఇక అనుష్క శెట్టి హీరోయిన్గా నటించింది .. అంధకాసురుడు అనే భయంకర రాక్షసుడిగా రవిశంకర్ నటించారు .. అలాగే అనుష్కను పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయి రాహుల్ పాత్రలో  గణేశ్ వెంక‌ట్రామన్  నటించాడు .. అయితే ఈ సినిమాలో రాహుల్ దే ఎంతో కీలకమైన పాత్ర .. ఒకవైపు అనుష్క ఫ్యామిలీతో సన్నిహితంగా ఉంటూనే వారికి కీడు చేయాలని విలన్ రోల్‌లో అద్భుతంగా నటించారు .. అలాగే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు గణేష్ వెంకట్రామన్ ..


అయితే ఈ నటుడు ఈనాడు తో పాటు పలు తమిళ్ , హిందీ సినిమాల్లో నటించాడు. ఇప్పటికీ పలు తమిళ సినిమాలతో బిజీగా ఉంటున్న గణేష్ టాలీవుడ్ లోను అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు .. త్రిష నాయకి , రాగలి 24 గంటల్లో , విజయ్ వారసుడు , శబరి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాడు . అయితే ఇక్కడ ఈ స్టార్ విలన్ భార్య కూడా తెలుగులో క్రేజీ హీరోయిన్ నే .. ఆమె ఎవరా అని అనుకుంటున్నారా.. ఆమె పేరు నిషా కృష్ణన్ .. ఈ పేరు చెబితే గుర్తుపడటం కష్టం కానీ విశాల్ హీరోగా నటించిన ఇంద్రుడు సినిమాలో హీరోయిన్ అంటే చాలామందికి గుర్తుకు వస్తుంది .. అలాగే కృష్ణుడికి వారసుడు అనే తెలుగు సినిమాలో కూడా నిషా హీరోయిన్గా నటించింది.


ఇక గణేష్ భార్య తెలుగు బుల్లితెర ప్రేక్షకులు కూడా బాగా పరిచయమే .. ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే శ్రీమంతుడు సీరియల్ లో ఈమె కీలక పాత్రలో నటిస్తుంది .. అలాగే మహాభారతం సీరియల్ తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ .. ఇక మహాభారతం సీరియల్ లో ఈమె ద్రౌపదిగా  నటించి అందరి ప్రశంసలు అందుకుంది .. ఇక గణేశ్ వెంకట్రామన్ , నిషా కృష్ణాన్ ల‌ది ప్రేమ వివాహం .. ఇద్దరు కుటుంబాల సమక్షంలో 2015 లో వీరి పెళ్లి జరిగింది .. ఈ జంట కి సమైరా అనే కూతురు అమర్ అనే కుమారుడు కూడా ఉన్నారు . ప్రస్తుతం ఇది స్టార్ కపుల్ వరుస‌ సినిమాలతో చిత్ర పరిశ్రమలు బిజీగా కొనసాగుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: