మెగాస్టార్ చిరంజీవికే చుక్కలు చూపించిన నటా? అంత టాలెంటెడ్ ఎవరనుకుంటున్నారా? ఆ విషయం తెలుసుకోవాలంటే ఈ పూర్తి కధనం చదవాల్సిందే. అందాల భామ నగ్మా గురించి ఈ తరానికి అంతగా తెలియకపోవచ్చు. కానీ 90s కిడ్స్ కి ఆమె బాగా సుపరిచితురాలు. కేవలం హీరోయిన్ నగ్మా అందాలు చూడడానికే ఓ వర్గం ఔత్సాహికులు అప్పట్లో థియేటర్లకు తరలి వెళ్లేవారు అంటే మీరు నమ్ముతారా? అవును, ఆమె 1990లో విడుదలైన భాగీ అనే బాలీవుడ్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. తెలుగులో 'పెద్దింటి అల్లుడు' సినిమాతో ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఆ సినిమాలో సుమన్ కి జంటగా నటించి మెప్పించింది. ఈ క్రమంలో ఆమె వరుసగా తెలుగు, హిందీ చిత్రాల్లో ఆమె నటిస్తూ చాలా బిజీ అయింది.
ఇక అప్పటి సూపర్ స్టార్లయినటువంటి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ తో నటించడంతో నగ్మాకు తెలుగులో భారీ క్రేజ్ ఉండేది. ఇక నగ్మా నటించిన ఘరానా మొగుడు, కొండపల్లి రాజా, మేజర్ చంద్రకాంత్, ముగ్గురు మొనగాళ్లు సినిమాలు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమాలు బాక్షాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. అయితే నగ్మా దాదాపుగా పొగరుబోతు క్యారెక్టర్స్ చేయడం వలన ఆమె బయట కూడా పొగరుగా ఉండేదనే టాక్ నడిచేది. ఈ నేపథ్యంలోనే ఘరానా మొగుడు సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవితో ఆమె గొడవపడ్డారనే టాక్ నడిచేది.
విషయం ఏమిటంటే... షూటింగ్ కి ఆలస్యంగా మెగాస్టార్ ఉదయం 5 గంటలకే వచ్చి సెట్స్ లో ఉంటే, నగ్మా మాత్రం తీరిగ్గా 7 గంటలకు సెట్స్ లో అడుగుపెట్టేదట. ఓ మూడు నాలుగు రోజులు చాలా సహనంగా ఉన్న మెగాస్టార్ ఆ తరువాత నగ్మాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. దాంతో ఇరువురి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరిందని టాక్. అయితే అనతికాలంలోనే వారు మరలా మరో సినిమా చేయడం విశేషం. మరోవైపు నగ్మ అప్పట్లో వివాదాలకు కూడా కేరాఫ్ అడ్రెస్స్ అయ్యేది. అప్పటి ఇండియన్ క్రికెట్ టీమ్ కి కెప్టెన్ గా వ్యవహరించిన గంగూలీతో నగ్మా చాలా కాలం ఎఫైర్ నడిపారనే అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. అయితే అందులో ఎంత నిజం, ఎంత అబద్ధం అనేది ఇప్పటికీ ఓ మిస్టరీనే!