తెలుగు సినిమా ముద్దుబిడ్డ మెగాస్టార్ చిరంజీవి గురించి జనాలకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన గురించి చెప్పడానికి పదాలు చాలవు. ఎందుకంటే ఈరోజు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాకి ఓ స్థాయి దక్కిందంటే దానికి ఆయన చేసిన కృషి ఎంతో ఉంది. ఇక తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని సైతం తట్టుకొని అప్పట్లో తెలుగు సినిమా నిలబడడానికి చిరంజీవి చాలా వరకు హెల్ప్ చేశాడు. ఇక అతని ప్రేరణతో సినిమా పరిశ్రమలోకి ఎంతోమంది వచ్చారు.. ఇప్పటికీ వస్తున్నారు కూడా.

దాదాపు 40 ఏళ్ల సినిమా అనుభవం.. 150కి పైనే సినిమాలు... అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ క్రమంలో మెగాస్టార్ టచ్ చేయని జోనర్ అంటూ ఏదీ లేదు. ముఖ్యంగా మెగాస్టార్ అంటే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉండేవారు. ఈ క్రమంలోనే సుప్రీం హీరో కాస్త మెగాస్టార్ గా ఎదిగారు. ఇక ఆయన హారర్ సినిమాలు కూడా చేశారనే విషయం మీకు తెలుసు. అలాంటి మెగాస్టార్ కి ఓ హారర్ సినిమా తెగ భయపెట్టేసిందట. నమ్మశక్యంలా లేదు కదూ. మీరు విన్నది నిజమే.

అవును, చిరంజీవికి హర్రర్ సినిమాలు చూడమంటే కొంతవరకు భయం అనే రూమర్లు వినబడేవి. అయితే అందులో ఎంతోకొంత నిజం లేకపోలేదు. ఒక సినిమాను చూసి ఆయన విపరీతంగా భయపడ్డాడట. ఆ సినిమా రాఘవ లారెన్స్ తీసిన కాంచన… నిజానికి ఈ మూవీలో చాలా హర్రర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రేక్షకుడు థియేటర్లో చూసినప్పుడు చాలా వరకు భయాందోళన కలిగించే సీన్స్ అయితే ఉంటాయి. కానీ సాధారణ ప్రేక్షకుడు ఒకేగానీ చిరంజీవి కూడా ఆ సినిమాను చూసి భయపడ్డట్టు ఒక సందర్భంలో తెలియజేశాడు. ఇక రాఘవ లారెన్స్ ను ఎంకరేజ్ చేసింది చిరంజీవి గారే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వాస్తవానికి చిరంజీవి లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే అంటారు అందరూ. చిరంజీవి చేసిన సినిమాలు దాదాపుగా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలే కావడంతో అతనికి మాస్ లో ఉన్న ఇమేజ్ అంతాఇంతాకాదు. యావత్ సినిమా ప్రేక్షకులందరూ అతనికి మాస్ సినిమాల వల్లే బాగా దగ్గరయ్యారు. అందువల్లే అతను ఎక్కువగా మాస్ ఎలిమెంట్స్ ఉండే విధంగా చూసుకుంటూ ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: