2024 సంవత్సరం మరి కొన్ని గంటల్లో ముగిసిపోనుంది .. 2024 కు గుడ్ బై చెప్పి.. 2025 సంవత్సరానికి వెల్కమ్ చెప్పనున్నాం .. ఇప్పుడు ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకలకు రెడీ అవుతుంది .. ఇక ఈ సంవత్సరం విపరీతమైన క్రెజ్‌ తెచ్చుకున్న హీరోయిన్లలో సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి .. 2024 లో ప్రేక్షకులను మెప్పించిన స్టార్ హీరోయిన్ ఎవరు అంటే అందరూ టక్కును చెప్పే పేరు సాయి పల్లవి .. మలయాళ  ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఆ తర్వాత తెలుగులో అడుగుపెట్టి లేడీ  ప‌వ‌ర్ స్టార్ గా దూసుకుపోతుంది. తమిళం , తెలుగు , మలయాళం సినిమాలో నటిస్తూ అదరగొడుతుంది.


ఇక ఈ సంవత్సరం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమరాన్ సినిమాతో మంచి విజయం అందుకుంది .. దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితానికి సంబంధించిన కథతో వచ్చిన ఈ సినిమాలో సాయి పల్లవి ముకుంద్‌ భార్య  “ఇందు రెబెక్కా వర్గీస్” పాత్రలో నటించింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో తన నేచురల్ పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ప్రజెంట్ తెలుగులో నాగచైతన్యతో కలిసి తండేల్‌ సినిమాలో నటిస్తుంది. అలాగే బాలీవుడ్లో రామాయణం సినిమా కూడా చేస్తుంది. తమన్నా గ‌త‌ 18 సంవత్సరాలుగా సౌత్ లో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది .. ఈ ముద్దుగుమ్మ శ్రీ సినిమాతో తెలుగులో అడుగు పెట్టింది .. ఇప్పటికీ సీనియర్ బ్యూటీ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది .. ఈ సంవత్సరం కోలీవుడ్ లో నటించిన బాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది.


సినిమా మంచి విజయం సాధించింది .. సుందర్ శ్రీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక తమిళనాడు లోనే 75 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది .. తెలుగులోను మంచి టాక్ తెచ్చుకుంది. దీనికన్నా ముందు 2023 లో విడుదల జైలర్ సినిమాలోని కావాలయ్య పాటుతో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత వచ్చిన బాక్‌ సినిమాలో “అచాచో” పాటలో రాశి ఖన్నాతో కలిసి డాన్స్ వేసి ప్రేక్షకులను మెప్పించింది. మరో సీనియర్ బ్యూటీ మంజు వారియర్.. వెట్రిమారన్‌ దర్శకత్వంలో వచ్చిన ఆసురాన్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను కటిప‌డేసింది .. ఈ మలయాళ బ్యూటీ. ఈ సంవత్సరం కోలీవుడ్ లో రెండు సినిమాల్లో నటించింది. జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కించిన వేట్టయన్  సినిమాలో రజినీకాంత్ భార్యగా నటించింది..  “మనసిలాయో” పాటలో తన డ్యాన్స్ తో  ఆడియన్స్ మనసుల్లో స్థానం సంపాదించుకుంది. అలాగే  డిసెంబర్ 20 న విడుదలైన వెట్రిమారన్ విడుదల పార్ట్ 2 లో విజయ్ సేతుపతి సరసన నటించింది రెండు సినిమాలు మంచి విజయం సాధించియి.

మరింత సమాచారం తెలుసుకోండి: