లాయర్ అవ్వాలని ఎన్నో కలలు కన్నా అమ్మాయి .. కానీ చివరకు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది .. ప్రజెంట్ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది .. ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో తాను ఏంటో స‌త్త చాటుతుంది బ్యూటీ .. చదివిందేమో  లా కానీ అనుకోకుండా చిత్ర పరిశ్ర‌మ‌లో ఎలా అడుగు పెట్టింది అనేది ఇక్కడ చూద్దాం . 2018 లో చిత్ర పరిశ్రమ లో అడుగు పెట్టింది అందం , అభినయం తో కుర్రాళ్లను ఒక ఊపు ఊపేస్తుంది .. తన మొదటి సినిమానే మాస్ మహారాజా రవితేజ తో కలిసి నటించింది .. ఆ తర్వాత గోపీచంద్ , సుదీర్ బాబు వంటి క్రేజీ హీరోలతో ఆడి పాడింది.


ఇంతకీ ఈ హీరోయిన్ మరెవరో కాదు మాళవికా శర్మ .. కోలీవుడ్ హీరో జీవాకు జంటగా నటించింది కానీ ఈ ముద్దుగుమ్మకు సరైన సక్సెస్ రాలేదు .. అయితే ఈ అందాల తార అభినయానికి మంచి మార్పులే కొట్టేసింది .. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లాయర్ గా ప్రాక్టీస్ చేస్తుంది. ముంబైలో పుట్టి పెరిగిన మాళవిక శర్మ అక్కడే చదువుకుంది .. ఎల్.ఎల్.బి పూర్తి చేసింది .. కాలేజీ రోజుల్లోనే మోడల్గా కెరియర్ మొద‌లు పెట్టింది అదే సమయంలో పలు యాడ్స్ లో కూడా నటించింది.


ఇక 2018లో రవితేజ నేల టికెట్ సినిమా తో టాలీవుడ్ లో అడిగిపెట్టింది .. ఆ తర్వాత రామ్ పోతినేని తో కలిసి రెడ్ సినిమాలో నటించింది .. ఈ రెండు సినిమాలు కూడా మాళవిక కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి . ఆ తర్వాత కాఫీ విత్ కాదల్ సినిమాతో కోలీవుడ్ లో అడుగు పెట్టింది .  అలాగే గోపీచంద్ కు జంటగా భీమా సినిమాలో నటించింది.  సుధీర్ బాబుతో కలిసి హరోం హర సినిమాల్లో కూడా నటించింది .. ప్రజెంట్ సరైన హిట్ కోసం ముద్దుగుమ్మ ఎదురు చూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: