పాట పాటకు ఒక సెలబ్రేషన్. ఐటమ్ సాంగ్ కి ఒక సెలబ్రేషన్స్. ఇలా నానా విధాలుగా చేస్తూ వస్తున్నారు మేకర్స్ . దీని ద్వారా డబ్బు నష్టపోవడమే కాకుండా ఫాన్స్ చేసే హంగామాలో కొంతమంది బాగా ఇబ్బందికర సిచువేషన్స్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. రీసెంట్గా అల్లు అర్జున్ ఫాన్స్ కారణంగా ఎలాంటి సిచువేషన్స్ లో ఎదుర్కొన్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇకపై సినీ సభ్యులు ఎవరు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అదేవిధంగా ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్స్ లాంటివి చేయకూడదు అంటూ డిసైడ్ అయ్యారట .
పాతకాలంలో అసలు ఇలాంటి ఈవెంట్స్ లేవు. కష్టాన్ని కథని నమ్ముకునేవారు. అదేవిధంగా సింపుల్ ప్రమోషన్స్ తోనే ఇకపై సినిమాలను ముందుకు తీసుకెళ్లాలి అంటూ స్టార్స్ భావిస్తున్నారు అట . తద్వారా ఫ్యాన్స్ హంగామా చేసే ఛాన్స్ ఉండదు. అంతేకాదు ఇలా అల్లు అర్జున్ లా ఊహించిన చిక్కుల్లో ఇరుక్కోవలసిన పరిస్థితి కూడా రాదు అంటున్నారు సినీ సభ్యులు. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఇక ఫ్యూచర్లో మళ్లీ మనం ఓల్డెన్ డేస్ పద్ధతిలోనే చూడబోతున్నాము అంటూ జనాలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు..!