ఈ సినిమాను 2025 అనగా వచ్చే కొత్త సంవత్సరంలో ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఇలా ఈ సినిమా అనౌన్స్మెంటు నుంచే పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సెన్సేషన్ గా దూసుకుపోతుంది. ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ కూడా ప్రేక్షకులకు గూస్ బంస్స్ తెప్పిస్తున్నాయి. ఇదే క్రమంలో ఈ సినిమాలో నాగార్జున నటిస్తున్న షూటింగ్ వీడియో కూడా సోషల్ మీడియాలో లీక్ అయింది .. అలాగే ఈ సినిమా థియేట్రికల్ , ఓటిటి బిజినెస్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది .. రికార్డు స్థాయిలో థియేట్రికల్ ,ఓటిటి రైట్స్ అమ్ముడైనట్టు వార్తలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు సొంతం చేసుకున్నారు. గతంలో లోకేష్ దగ్గర నుంచి వచ్చిన లియో సినిమాని కూడా సితార వాళ్లే తీసుకున్నారు .. ఇప్పుడు రజనీకాంత్ కూలి సినిమాని కూడా తెలుగులో నాగవంశీ రిలీజ్ చేయబోతున్నారు. ఇలా రిలీజ్ కి చాలా సమయం ఉన్నా కూడా పాన్ ఇండియా లెవెల్ లో రజనీకాంత్ తన హవా చూపిస్తున్నారు.
అలాగే భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమాకు రజినీకాంత్ ఏకంగా 260 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇలా సౌత్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా కూడా రజనీకాంత్ చరిత్ర సృష్టించబోతున్నారు .. ఇప్పటివరకు ప్రభాస్ , సల్మాన్ ఖాన్ అల్లు అర్జున్ వంటి హీరోలు మాత్రమే ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక రెమ్యూనిరేషన్ తీసుకున్న హీరోలుగా నిలిచారు. ఇప్పుడు రజినీకాంత్ కూలి సినిమాతో ఈ రికార్డును బ్రేక్ చేయబోతున్నారు. ఇక మరి వచ్చే 2025లో కూలి సినిమాతో రజనీకాంత్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి.