పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో "ది రాజాసాబ్" సినిమా ఒకటి. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఇంతవరకు ఎప్పుడూ కనిపించని విధంగా హారర్ కామెడీ జోనర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2025 ఏప్రిల్ 10వ తేదీన "ది రాజాసాబ్" సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.


ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ నటించనున్నాడు. ఈ ముగ్గురు మాత్రమే కాకుండా లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం ఈ సినిమాలో ప్రముఖ పాత్రలో కనిపించబోతుందని వార్తలు వస్తున్నా యి. ఈ సినిమాలో నయనతార నటించడానికి గల ప్రధాన కారణం ప్రభాస్ తో స్నేహం.


ఈ కారణంగానే స్టార్‌ హీరోయిన్‌, అందాల తార నయనతార ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతుందట. ఏకంగా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా చేయబోతుందని వార్తలు వస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో వస్తున్న "ది రాజాసాబ్" సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభాస్ కి ఫౌజీ సినిమా షూటింగ్ లో కొన్ని గాయాలు అయ్యాయట. ఆ గాయాల కారణంగా రాజా సాబ్ సినిమా షూటింగ్ మీద కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది.

కాస్త లేట్ అయిన 2025లో "ది రాజాసాబ్" సినిమా రిలీజ్ కన్ఫామ్ అని చెబుతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా సమ్మర్ హాలిడేస్ లో రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమా కనుక రిలీజ్ అయితే 2025లో ప్రభాస్ మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంటాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న రాజాసాబ్‌ ఏ మేరకు హిట్‌ అవుతుందో చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: