అయితే రజినీకాంత్ కెరియర్లో ఆయనకు కూతురుగా , లవర్ గా , మరదలుగా భార్యాగా నటించిన ఏకైక హీరోయిన్ ఒకరు ఉన్నారు .. రజినీకాంత్ కు జంటగా అన్ని పాత్రలో నటించిన ఆమె మరెవరో కాదు సీనియర్ హీరోయిన్ మీనా.. మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గానే చిత్ర పరిశ్రమ లో అడుగుపెట్టింది. ఇక మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా 1982లో వచ్చిన కోలీవుడ్ సినిమా నెంజంగల్’ లో నటించింది.. అలాగే రజినీకాంత్ హీరోగా నటించిన ‘ఎంకెయో కెట్టా కురల్’, ‘అన్బుల్లా’ వంటి పలు తమిళ సినిమాల్లోనూ మీనా నటించింది .. ఇలా చిన్న వయసులోనే తన అద్భుతమైన నటనతో ఎనో ప్రశంసలు అందుకుంది . ఎంగెయాకెట్ట కరుల్' సినిమాలో రజనీకాంత్ కు కూతురుగా నటించింది .. ఇక ఆ తర్వాత వచ్చిన వీర, యజమాన్, ముత్తు సినిమాల్లో లవర్ , మరదలు , భార్యా పాత్రలో నటించింది..
ఇలా రజినీకాంత్ తో పలు సినిమాల్లో నటించింది .. మళ్లీ 24 సంవత్సరాల తర్వాత మరోసారి ఈ హిట్ జంట కలిసి నటించబోతున్నట్టు తెలుస్తుంది .. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మీనాన్ని ఈ విషయంపై అడగగా దీనిపై ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదు .. మీనా విషయానికి వస్తే కరోణ సమయంలో మీనా భర్త చనిపోయారు .. అలాగే ఈమెకు నైనిక అనే కూతురు కూడా ఉంది. ఈ చిన్నారి కూడా దళపతి విజయ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టింది.. అలాగే మలయాళం లో వచ్చిన దృశ్యం సినిమాతో చిత్ర పరిశ్రమలో మీనా తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది .. ఈ సినిమాలో మీన తల్లి పాత్రలో నటించిన సూపర్ హిట్ అందుకుంది.