2024 సంవత్సరం టాలీవుడ్ కు అంతగా కలిసివచ్చే రిజల్ట్ ఏమీ ఇవ్వలేదు .. ఇప్పుడు అందరి దృష్టి 2025 మీదే ఉంది .. కొత్త  ఏడాదిలో కొత్త కాంబినేషన్స్ అందర్నీ ఎంతగానో ఊరిస్తున్నాయి .. నెవర్ బిఫోర్ కాంబోస్ షూటింగ్లో సందడి చేయబోతున్నాయి .. అప్డేట్స్ తో సినీ అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. ఇక మరి 2025 లో ప్రేక్షకులను అలదించబోతున్న కాంబినేషన్ ఏంటో ఇక్కడ చూద్దాం. రాజకీయాల్లో విజయం తర్వాత సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కి రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ 2025 లో హరిహర వీరమల్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ , పవన్ కు జంటగా నటిస్తున్నారు .. ఒక బందిపోటును ప్రేమించే యువరాణిగా నిధి ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు కూడా కొత్త జంటని సెట్ చేసుకునే పనిలో ఉన్నారు ..


ఆర్సీ 16 షూటింగ్లో బిజీ గా ఉన్న రామ్ చరణ్ ఈ సినిమాలో మొదటిసారి జాన్వీ కపూర్ తో కలిసి నటించబోతున్నారు. చిరంజీవి - శ్రీదేవి జంట సిల్వర్ స్క్రీన్ మీద క్రియేట్ చేసిన మ్యాజిక్ .. చరణ్ - జాన్వీ విషయంలో రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు .. వీరందరూ మాత్రమే కాదు ది రాజాసాబ్ సినిమాతో ప్రభాస్ కూడా మాళవిక మోహనన్‎ తొ లిసారి జంటగా కనిపించబోతున్నారు .. రొమాంటిక్ హర్రర్ కామెడీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రిద్ధి కుమార్, నిథి అగర్వాల్‌ కూడా హీరోయిన్లుగా ఉన్నారు .. అలాగే హను రాఘవపూడి తో చేస్తున్న సినిమాలో కూడా కొత్త హీరోయిన్ ఇమాన్వి తో కలిసి నటించబోతున్నాడు ప్రభాస్ ..


అన్ని అనుకున్నట్టు కుదిరితే ఈ సినిమా కూడా 2025 లోనే రానుంది. అక్కినేని బ్రదర్స్ ఇద్దరితో ఒకేసారి సినిమాలు చేస్తున్నారు శ్రీలీలా.. నాగ‌ చైతన్య హీరోగా కార్తీక్ దండు డైరెక్షన్లో రాబోయే సినిమాతో పాటు అఖిల్  మురళీ కిశోర్‌ అబ్బూరు సినిమాలోను శ్రీలీల‌ హీరోయిన్గా నటిస్తుంది. ఎన్టీఆర్ కూడా ఈసారి కొత్త కాంబోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .. బాలీవుడ్ మూవీ గా వస్తున్న వార్‌ 2 లో ఎన్టీఆర్‌కు జంటగా కిరాయా అద్వానీ నటిస్తుంది .. అయితే ఈ సినిమాలోకిరాయా అద్వానీ ఎన్టీఆర్ కు జంటగా కనిపిస్తుందా లేదా అన్న విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: