"గేమ్ చేంజర్".. త్వరలోనే ఇండస్ట్రీలో ఈ సినిమా ఒక గేమ్ చేంజర్ గా మిగిలిపోతుంది అంటున్నారు జనాలు.  టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో ఎంతో ఇష్టంగా ..ఎంతో కష్టపడి నటించిన సినిమానే ఈ "గేమ్ చేంజర్" . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న కోలీవుడ్ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది . అమెరికాలో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకున్నారు . శంకర్ అంటే వేరే మార్క్ కచ్చితంగా ఉంటుంది . ఆ మార్కును తన సినిమాలో కచ్చితంగా చూపించబోతున్నాడు అంటున్నారు మూవీ మేకర్స్ .


మరి ముఖ్యంగా రామ్ చరణ్ ని మనం ఈ సినిమాలో చూసినట్టు ఇదివరకు ఎప్పుడు కూడా చూసి ఉండము అని ఆయనలోని డిఫరెంట్ యాంగిల్ ని బయటపెట్టాడు డైరెక్టర్ శంకర్ అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . కాగా "గేమ్ చేంజర్" సినిమా విషయంలో చాలామంది ఆశలు పెట్టుకొని ఉన్నారు. కొందరికి ఈ సినిమా బిగ్ లైఫ్ చేంజింగ్ మూమెంట్గా మారిపోతోంది అంటున్నారు . అయితే గేమ్ చేంజర్ పై ఎంత పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయో అంతే నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . కాగా గేమ్ చేంజర్ సినిమా హిట్ అవ్వచ్చు.. ఫ్లాప్ అవ్వచ్చు . హిట్ అయిన ఫ్లాప్ పైన కచ్చితంగా బాగుపడేది మాత్రం ఒకే ఒక్క హీరోయిన్ అంటున్నారు జనాలు . ఆమె "అంజలి".



అంజలి కి తెలుగు సినిమాలలో అవకాశాలు రావడమే గొప్ప విషయం.  ఇలాంటి పెద్ద బడా స్టార్ సినిమాలో అవకాశం వచ్చినప్పుడే ఆమె సూపర్ సక్సెస్ అయిపోయింది . గేమ్ చేంజర్ సినిమా కారణంగా.. ఆమె ఎన్ని అవకాశాలు అందుకుందో అందరికీ తెలిసిందే . అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో ఆమె 'గేమ్ చేంజర్' గా రోల్ ఉంటుందట . ఈ కారణంగానే అంజలి లుక్స్ ను అంజలి సీన్స్ ను ఎక్కడ కూడా డైరెక్టర్ , మూవీ మేకర్స్ బయట పెట్టలేదట . ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అంజలి స్టోరీ చాలా చాలా కీలకంగా మారిపోతుందట . ఆ కారణంగానే అంజలి కి ఈ సినిమా ఊహించిన హిట్ ఇవ్వబోతుంది అని ..లైఫ్ చేంజింగ్ మూమెంట్ అంజలికి ఈ సినిమా అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు . ఒకవేళ సినిమా ఫ్లాప్ టాక్ దక్కించుకున్న అంజలి క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా హైలైట్ గా మారుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.  సోషల్ మీడియాలో ఈ న్యూస్ మారుమ్రోగిపోతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: