ఒక లాంగ్వేజ్ లో హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేసుకోవడం ఎంతో ఈజీగా ఉంటుంది.. కానీ ఒరిజినల్ వెర్షన్‌కు వచ్చిన ఫలితమే వస్తుందన్న గ్యారెంటీ ఉండదు. ఒకప్పుడు ఓటీటీ , ఇంటర్నెట్ లేవు కాబట్టి అది చెళ్ళిపోయింది .. కానీ ఇప్పుడు అలా కాదు .. తెలుగులో , తమిళంలో ఒక హిట్ సినిమా వచ్చిందంటే చాలు వెతికి మరీ సబ్ టైటిల్స్ తో చూస్తున్న ప్రేక్షకులు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచం మొత్తం కోట్లలో ఉన్నారు. ఇలాంటి క్రమంలో వీటి ఎంపికలో చాలా జాగ్రత్త తీసుకోవాలి.  ఏం మాత్రం తేడా కొట్టిన అసలుకే మోసం వచ్చి నిర్మాతలకు కనీసం మెయింటెనెన్స్ డబ్బులు కూడా రావు. ప్రజెంట్ బాలీవుడ్ కు ఇలాంటి దెబ్బలే తగులుతున్నాయి.


గత రెండు మూడు సంవత్సరాలను పరిగణలోకి తీసుకుంటే రీమిక్ లో హిట్ అయిన సినిమాలు రెండే కనిపిస్తున్నాయి .. ఒకటి సైతాన్ , మరొకటి దృశ్యం 2 .. డిజాస్టర్ అయినవి మాత్రం లెక్కలేనన్ని ఉన్నాయి. ఆ సినిమాల వైపు ఒక లుక్ వేస్తే ..తడప్ (ఆరెక్స్ 100), నికమ్మ (నాని ఎంసీఏ), బచ్చన్ పాండే (గద్దలకొండ గణేష్), షెహ్జాదా (అల వైకుంఠపురములో), కిసీకా భాయ్ కిసీకా జాన్ (కాటమరాయుడు), గుంరా (రెడ్), సర్ఫిరా (ఆకాశం నీ హద్దురా), ఛత్రపతి (ఛత్రపతి), లాల్ సింగ్ చద్దా (ఫారెస్ట్ గంప్), భోళా (ఖైదీ), మిలి (హెలెన్), సెల్ఫీ (డ్రైవింగ్ లైసెన్స్) ఇలా వ‌చ్చిన సినిమా గూరించి చెప్పుకుంటూ పోతే వెళ్తూనే ఉంటుంది తప్ప ఎక్కడ ఆగదు .. ఇవన్నీ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డాయి.


రీసెంట్ గానే ప్రేక్షకులు ముందుకు వచ్చిన బేబీ జాన్ (తేరి) ఈ సినిమా కూడా ఈకోవలోకి వచ్చేందుకు గట్టిగా పరుగులు పడుతుంది. వరుణ్ ధవన్ ను సూపర్ స్టార్ చేస్తానని చెప్పన దర్శకుడు అట్లీ నిర్మాతగా మారి వరుణ్ ధావన్ తో పాటు కీర్తి సురేష్ కి కూడా పెద్ద షాక్ ఇచ్చాడు. దీంతో ముంబాయి ప్రేక్షకులు , విశ్లేషకులు ఇక్కడ నిర్మాతలు , దర్శకులు వీలైనంత త్వరగా రీమేకులు ఆపాలని కోరుకుంటున్నారు. పుష్ప 2 సినిమాకు దక్కుతున్న ఆదరణ చూసైనా హీరో పరిచయం ఇమేజ్‌తో సంబంధం లేకుండా ఉత్తరాది ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకొంటున్నారు అర్థం చేసుకోవాలని వారు అంటున్నారు. బాహుబలి , త్రిబుల్ ఆర్ , కే జి ఎఫ్ , కాంతారా లాంటి సినిమాలు రికార్డులు క్రియేట్ చేయడానికి కారణాలు ఏంటో ఒకసారి రివ్యూ చేసుకోమని కోరుకుంటున్నారు. ఇక మరి రాబోయే రోజుల్లో ఆయన బాలీవుడ్‌కు మంచి రోజులు వస్తాయో లేవో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: