సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల ఫోటోలు ట్రెండ్ అవ్వడం ..అలాగే వైరల్ అవ్వడం మనం ఈ ంధ్య కాలంలో ఎక్కువుగా చూస్తూనే ఉన్నాం . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రెటీస్ చిన్నప్పటి ఫోటోలు ఎక్కువగా ట్రెండ్ అవుతూ వైరల్ అవుతూ వస్తున్నాయి . అయితే ఆ పద్ధతిని కాస్త యు టర్న్ తీసుకొని ఇప్పుడు స్టార్ సెలబ్రిటీస్ డిఫరెంట్ ఫోటోల సు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వాళ్లకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెడుతున్నారు అభిమానులు.


తాజాగా ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని వ్యక్తికి సంబంధించిన విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా మారుమ్రోగిపోతున్నాయి . ఇక్కడ మీరు చూస్తున్న ఫోటోలోని వ్యక్తి ఎవరో అనుకునేరు.. ఒక బడా డైరెక్టర్ . రాజమౌళి - ప్రశాంత్ వర్మ - ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ దర్శకులకు కూడా కాంపిటీషన్ ఇచ్చే సత్తా ఉన్న డైరెక్టర్ . ఐదు సంవత్సరాలకి ఒక సినిమా తెరకెక్కిస్తాడు . కానీ తెరకెక్కించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్టుగా మార్చుకుంటారు. అంతేనా తన సినిమాలో బోల్డ్ సీన్స్ పెట్టి బోల్డ్ కే  చెమటలు పట్టించే రేంజ్ లో సీన్స్ చిత్రీకరిస్తారు .



ఇప్పటికే ఈ డైరెక్టర్ ఎవరో మీకు అర్థం అయిపోయి ఉంటుంది . ఇక్కడ మీరు చూస్తున్న ఈ డైరెక్టర్ మరెవరో కాదు "సందీప్ రెడ్డి వంగ".  సందీప్ రెడ్డివంగా ఏంటి ఇలా మారిపోయాడు అనుకుంటున్నారా..? గతంలో టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన "మహానటి" సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో మెరిశారు. వేదాంతం రాఘవయ్య గా కనిపించారు. దానికి సంబంధించిన ఫొటోస్ ఇవి. ఈ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి .దీంతో సందీప్ రెడ్డివంగా పేరు మారుమ్రోగిపోతుంది. సందీప్ రెడ్డి వంగ - ప్రభాస్ తో "స్పీరిట్" అనే మూవీకి కమిట్ అయి ఉన్నాడు . అదేవిధంగా "అనిమల్ పార్క్" అంటూ ఇండస్ట్రీని భయపెట్టే విధంగా భారీ సినిమాను ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టుకున్నాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: