టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, హీరో రాజేంద్రప్రసాద్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. కామెడీ హీరోగా తన కెరీర్ ప్రారంభించిన ఇతను స్టార్ హీరోగా ఎన్నో సినిమాలలో నటించారు. ఒకప్పుడు సంవత్సరానికి 12, 13 సినిమాలలో నటించేవారు. ఇప్పటికి రాజేంద్రప్రసాద్ సినిమాలలో నటించడం విశేషం. రాజేంద్రప్రసాద్ 8వ దశకం నుంచి బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఆహనా పెళ్ళంట, ఆ ఒక్కటి అడక్కు, రాజేంద్రుడు గజేంద్రుడు వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.


ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో హాస్య చిత్రాలలో హీరోగా నటించి హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజేంద్రప్రసాద్ నటించిన సినిమాలలో అప్పుల అప్పారావు, మాయలోడు, లేడీస్ టైలర్, ఆహా నా పెళ్ళంట వంటి సినిమాలు టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన రాజేంద్రప్రసాద్ 2017 ఏప్రిల్ లో జరిగిన మా ఎన్నికలలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఇక అసలు విషయానికి వస్తే...రాజేంద్రప్రసాద్ ఎప్పుడో కానీ రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడరు.


రాజేంద్రప్రసాద్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.... ఎన్టీఆర్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు. అయితే లక్ష్మీపార్వతిపై మాత్రం తీవ్ర విమర్శలు చేశారు. ఆమె పేరును ప్రస్తావించకుండానే ఆమెను ఒక దరిద్రం అంటూ తీవ్ర వాక్యాలు చేశారు. ఆ దరిద్రం వల్లే ఎన్టీఆర్ అందరికీ దూరమయ్యారని రాజేంద్రప్రసాద్ అన్నారు.


ఆమె ప్లాన్ చేసుకొని వచ్చి మరి ఎన్టీఆర్ జీవితాన్ని నాశనం చేసిందని టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. చంద్రబాబును విమర్శించేందుకు ప్రత్యర్థి పార్టీల నేతలకు అస్త్రంగా మారిన వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ గురించి కూడా రాజేంద్రప్రసాద్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పెద్దాయన ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన పిల్లలకంటే తానే ఎక్కువగా ఏడ్చానని టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్ సంచలన కామెంట్లు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: