గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో హీరోయిన్ అంజలి, శ్రీకాంత్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి స్టూడియోస్ దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.


గేమ్ చేంజర్ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషలలో జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోని ఆదివారం ఆర్సి యువశక్తి ఆధ్వర్యంలో విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్ ను ఆవిష్కరించారు. 256 అడుగుల ఎత్తైన ఈ కటౌట్ లాంచ్ ఈవెంట్ కు దిల్ రాజు ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన డేట్ బట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో నిర్వహిస్తామని దిల్ రాజు చెప్పారు.


అయితే ఇప్పుడు హైదరాబాద్ లో జనవరి ఒకటవ తేదీన విడుదల ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం దాదాపుగా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయని అనుమతులు తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. అయితే ఆ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ప్రస్తుతం విజయవాడలో ఉన్న దిల్ రాజు హైదరాబాద్ వచ్చాక రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వానించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. కాగా, ఇటీవల దిల్ రాజుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకమైన పదవిని కట్టబెట్టింది. ఇది ఇలా ఉండగా...  సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా స్థాయిలో జనవరి 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది గేమ్‌ ఛేంజర్‌ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: