మెగా పవర్ స్టార్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ నాలుగు పాటలను , టీజర్ ను , కొన్ని పోస్టర్లను విడుదల చేశారు. వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే చరణ్ అభిమానులు ఆయనకు ఓ భారీ కట్ అవుట్ ను తాజాగా నిర్మించారు.

ఇక ఈ కటౌట్ ఓపెనింగ్ కు గేమ్ చేంజర్ మూవీ నిర్మాత అయినటువంటి దిల్ రాజు విచ్చేశాడు. ఇక కటౌట్ విడుదలలో భాగంగా ఓ ఈవెంట్ ఏర్పాటు చేయగా అందులో దిల్ రాజు మాట్లాడుతూ ... ఈ సినిమాకు సంబంధించిన చాలా విషయాలను తెలియజేశాడు. తాజా ఈవెంట్లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... ఈ సినిమాలో రామ్ చరణ్ పొలిటికల్ లీడర్ గా , ఐఏఎస్ ఆఫీసర్ గా మాత్రమే కాకుండా పోలీస్ ఆఫీసర్ గా కూడా కనిపించబోతున్నట్లు చెప్పాడు. ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన టీజర్ లో చరణ్ కేవలం పొలిటికల్ లీడర్ , ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో మాత్రమే కనిపించాడు. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కూడా కనిపించబోతున్నట్లు దిల్ రాజు చెప్పడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.

ఇక ఈ సినిమా ట్రైలర్ను వచ్చే సంవత్సరం జనవరి 4 వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ దిల్ రాజు తాజా ఈవెంట్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ను వచ్చే సంవత్సరం జనవరి 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా రానున్నట్లు ఆయనకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఉండనున్నట్లు దిల్ రాజు చెప్పాడు. ఇలా నిన్న జరిగిన ఈవెంట్లో భాగంగా దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన అనేక అప్డేట్లను తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: