తెలుగు సినిమాలో మల్టీస్టారర్లు కొత్తేమీ కాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచే ఈ మల్టీస్టారర్ చిత్రాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఆ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. మధ్యలో స్టార్ హీరోలు మల్టీస్టారర్లపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఇలాంటి చిత్రాలు రాలేదు. ఇప్పుడు యువ హీరోలు మాత్రం తోటి హీరోలను నటించడానికి సై అంటున్నారు. అందుకే తెలుగులో ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్లు బాగానే వస్తున్నాయి. అలాంటి వాటిలో ‘దేవదాస్’ ఒకటి. కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని తొలిసారి కలిసి నటించారు.ఇదిలావుండగా సినిమా నాగార్జున, నాని కోసమే తీసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పాత్రల్లో వీళ్లిద్దరూ అంత బాగా నటించారు. మంచితనం, నిజాయతీ, ఎవరికీ హాని తలపెట్టని తత్వం కలిగిన డాక్టర్ పాత్రలో నాని నటన అద్భుతం. తన అమాయకత్వంతోనే హాస్యాన్ని పండించారు. నాని కనిపించే ప్రతి సన్నివేశం నవ్వు తెప్పిస్తుంది. ఇక డాన్ పాత్రలో నాగార్జున అదరగొట్టారు. సుమారు అరవయ్యేళ్ల వయసులోనూ కండలు తిరిగిన బాడీతో కింగ్ అనిపించుకున్నారు. అక్కినేని అభిమానులకు ఇది ఫుల్ ఫీస్ట్. ఆ స్టైల్, గ్లామర్, కాస్ట్యూమ్స్నాగ్ ఈజ్ బ్యాక్ అనిపిస్తాయి. ‘నువ్వు చదివే స్కూలుకి నేను హెడ్ మాస్టర్‌ని రా’ అంటూ విలన్‌తో నాగ్ చెప్పే డైలాగ్ విజిల్స్ వేయిస్తుంది.

ఇక రష్మిక మందన తన క్యూట్ లుక్స్‌తో కట్టిపడేసింది. ఆమె పాత్రకు కూడా మంచి ప్రాధాన్యతే ఉంది. టీవీ యాంకర్ జాహ్నవిగా ఆకాంక్ష మెప్పించింది.ఇదిలావుండగా దేవదాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వేదిక ఎదురుగా కూర్చున్న నానిని ఉద్దేశిస్తూ నాగార్జున ఏం నాని నేను రాకముందు ఏం మాట్లాడావు. టార్చర్ పెడుతున్నానా? నిజానికి నువ్వే నన్ను టార్చర్ పెట్టావు. సుమ నాని ముఖం చూసి మోసపోవద్దు. నేను అలానే మోసపోయాను. చాలా డీసెంట్ గా కనిపిస్తే కలిసి మూవీ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు నరకం చూపించాడు, అన్నారు. నాగార్జున మాటలకు నాని చిన్నగా నవ్వేశారు.అయితే ఇదంతా సరదాగా నాని మీద నాగార్జున చేసిన కామెంట్స్ మాత్రమే. ఆ మూవీలో నానిని నాగార్జున బాగా ఇబ్బందిపెడతాడు. దేవదాస్ మూవీలో పాత్రలను ఉద్దేశిస్తూ ఒకరిపై మరొకరు ఇలా ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇక దేవదాస్ మూవీ సెట్స్ లో నాని ఎలా ఉండేవాడో కూడా నాగార్జున తెలియజేశాడు. నాని అస్తమానం ఫోన్ చూసుకుంటాడట. ఏం చూస్తాడో అర్థం కాదు. ఒక అందమైన అమ్మాయిని పక్కన కూర్చోబెట్టినా కూడా నాని ఫోన్ చూసుకుంటాడని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: