తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ లో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో రష్మిక మందన ఒకరు. ఈ బ్యూటీ ఛలో మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత కూడా ఈమెకు చాలా సినిమాలతో మంచి విజయాలు దక్కడంతో ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇకపోతే ఈమె చాలా తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణం ఈమె నటించిన సినిమాలలో చాలా శాతం సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడమే.

ఈ ముద్దు గుమ్మ సినిమాల ఎంపికలో అద్భుతంగా వ్యవహరిస్తుంది అని  ,ఏ సినిమాలు అయితే విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయో అలాంటి సినిమాలను ఎంచుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టే అవకాశాలు ఉన్న సినిమాలను రిజెక్ట్ చేస్తుంది అని అందుకే ఈమె అంత గొప్ప స్థాయికి చాలా త్వరగా చేరుకుంది అనే అభిప్రాయాలను కొంత మంది జనాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ బ్యూటీ తన కెరీర్లో కొన్ని ఫ్లాప్ సినిమాలను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఓ కీలకమైన నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే చరణ్ కు జోడిగా నటించింది.

ఇక మొదట ఈ మూవీ లో చరణ్ కి జోడిగా పూజా హెగ్డే ను కాకుండా ఈ సినిమాలో రష్మిక ను మేకర్స్ సెలెక్ట్ చేశారట. కానీ ఆమె మాత్రం ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఇక తమిళ నటుడు తలపతి విజయ్ హీరోగా రూపొందిన బీస్ట్ మూవీ లో కూడా మొదట ఈమెనే హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారట. ఈమె మాత్రం ఆ ఆఫర్లు రిజెక్ట్ చేసిందట. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: