టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కస్రాండా ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాలలో కనిపించడం లేదు. ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు చిత్రాలలో నటిస్తూ ఉండేది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తూ అడపాదడక చిత్రాలలో కూడా నటిస్తోంది. అయితే రెజీనా గురించి తాజాగా కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా రెజీనా పుట్టింది ముస్లిం కుటుంబంలోనట .కాని ఆ తర్వాత తాను క్రైస్తవ మతాన్ని స్వీకరించినట్లు వెల్లడించింది. మరి రెజినా గురించి వైరల్ గా మారుతున్న ఈ విషయం గురించి పూర్తి విషయాలు ఇప్పుడు చూద్దాం.


అయితే రెజీనా మొదట ముస్లిం కుటుంబంలో పుట్టి ఆ తర్వాత క్రైస్తవ మతంలోకి వెళ్లడానికి కారణాలను తెలుపుతూ.. రెజీన 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించిందట. ఈమెకు 9 సంవత్సరాల వయసులోనే పిల్లల టీవీ ఛానల్ లో యాంకర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిందట. 14 ఏళ్ల వయసుకే తమిళ చిత్రం కంద నాన్ మూ అనే చిత్రంలో చెల్లెలి పాత్రలో నటించిందట. ఇక 2012లో ఎస్ఎంఎస్ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి ఉత్తమ తొలి నటి అవార్డు కూడా అందుకున్నది.


అలా తెలుగు, హిందీ , తమిళ భాషలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. మతం మార్పుపై..తన తండ్రి ముస్లిం, తల్లి క్రిస్టియన్ వీరిద్దరిది ప్రేమ వివాహమని అలా పుట్టినప్పటినుంచి 6 ఏళ్ల వరకు ముస్లిం అమ్మాయిగా పెరిగానని ఆ తర్వాత తమ తల్లిదండ్రులు ఇద్దరు కూడా విడాకులు తీసుకొని విడిపోయారని దీంతో తన తల్లి దగ్గర తాను పెరగాల్సి వచ్చిందని.. అయితే ఆ సమయంలో ఇస్లాం గురించి తన తల్లికి ఏది తెలియదు కాబట్టి ఆమె తనను క్రైస్తవ మతాన్ని అనుసరించమంటూ తెలిపిందట.ఆ తర్వాతే తాను చర్చిలో బాస్టిజం పొంది ఆ మతంలోకి మారానంటూ వెల్లడించింది. అందుకే తన పేరును కూడా మార్చుకున్నట్లు వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: