తెలుగు సినీ పరిశ్రమలో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగించిన వారిలో అనుష్క , సమంత , కాజల్ ముందు వరుసలో ఉంటారు. వీరంతా చాలా సంవత్సరాల క్రితమే తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలం లోనే మంచి విజయాలను అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్స్ స్థానానికి చేరుకున్నారు. ఇక స్టార్ హీరోయిన్స్ గా చాలా కాలం పాటు కెరియర్ను కొనసాగించిన వీరంతా కూడా ఆ తర్వాత కమర్షియల్ సినిమాల్లో అందాలను ఆరబోయడం కంటే కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో , పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించడానికి ఆసక్తిని చూపిస్తూ వస్తున్నారు.

ఇకపోతే ఇప్పటికే అనుష్క , సమంత , కాజల్ ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించారు. అనుష్క ఇప్పటికే ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకొని కేవలం కమర్షియల్ సినిమాలలో అందాలను ఆరబోయడం మాత్రమే కాదు అద్భుతమైన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోగలను అని నిరూపించుకుంది. అలాగే సమంత కూడా ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి అందులో కొన్ని సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. ఇకపోతే కాజల్ ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించిన ఏ సినిమాతో కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు.

తాజాగా కూడా కాజల్ "సత్యభామ" అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ కోసం ఈ బ్యూటీ పెద్ద ఎత్తున ప్రచారాలను కూడా చేసింది. సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో కాజల్ మంచి విజయం అందుకుంటుంది అని చాలా మంది భావించారు. కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈమెకు నిరాశనే మిగిల్చింది. ఇలా అనుష్క , సమంత సక్సెస్ అయిన లేడీ ఓరియంటెడ్ జోనర్ మూవీలలో కాజల్ మాత్రం సక్సెస్ కాలేక పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: