టాలీవుడ్ సీనియర్ హీరో మురళీ మోహన్ ఇండస్ట్రీలో రాజకీయాలలో మంచి పేరు సంపాదించారు. అయితే ఈయన మనవరాలు (రాగ మాగంటి) ఇటీవలే కీరవాణి కుమారుడు శ్రీ సింహ తో చాలా గ్రాండ్గా వివాహాన్ని జరిపించడం జరిగింది. అయితే ఈ వివాహం గురించి మురళీమోహన్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.



మురళీమోహన్, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇద్దరూ కూడా క్లాస్ మెట్సే నట.. ఈ బంధం వల్లే కీరవాణి అబ్బాయికి మీ మనవరాలినిచ్చి వివాహం చేశారా అని యాంకర్ అడగగా.. అందుకు మురళీమోహన్ కాదని చెబుతూ.. దానికి వీరికి సంబంధం లేదు.. ప్రస్తుతం రాజమౌళి ,కీరవాణి ఇద్దరూ కూడా సినీ ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్నారని తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారని తెలిపారు. అంతకుముందు రాజమౌళి గారి అబ్బాయి భార్య (పూజా ప్రసాద్) వి.బి.రాజేంద్రప్రసాద్ గారి మనవరాలనే ఇచ్చారు. ఆ అమ్మాయి తన మనవరాలు(రాగ మాగంటి) కూడా మంచి స్నేహితులని తెలిపారు. ఇద్దరు కూడా క్లాస్మేట్స్ అని తెలిపారు. ఆ అలవాటు తోటి వివాహమైన కూడా తన మనవరాలు కూడా వాళ్ళ ఇంటికి వెళుతూ ఉండేదట.


అక్కడ వాళ్ళ ఫ్యామిలీతో బాగా టైమ్ స్పెండ్ గడపడం, ఇక ఫ్యామిలీ అంతా కూడా ఆప్యాయంగా ఉండడంతో కుటుంబం అంతా కూడా సరదాగా ఉండడంతో ఇలా వారితో ఉన్న స్నేహాన్ని చూసి బాగా వారి కుటుంబానికి అట్రాక్ట్ అయ్యిందని.. తన మనవరాలకి చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబాలు అంటే చాలా ఇష్టమని తెలిపారు మురళీమోహన్. అయితే అప్పటికి తన మనవరాలు ఎంబీఏ చదువుతోందని పెళ్లి విషయంపై అడగగా.. అప్పుడు తన మనవరాలు బయట పెట్టిందని తెలిపారు మురళీ మోహన్. తాను ఒక వ్యక్తిని లైక్ చేస్తున్నారని చెప్పిందట.. ఎవరు అని అడగగా కీరవాణి గారి అబ్బాయి అంటూ తెలిపిందట. మీరు అనుమతిస్తే వివాహం చేసుకుంటామని చెప్పారట. ఈ పెళ్లి కుదిరిందని తెలిసినప్పటి నుంచి చాలామంది మంచి కుటుంబానికి పంపిస్తున్నారు అంటూ మురళీమోహన్ తో మాట్లాడారట. ఇక పెళ్లిలో కూడా రాజమౌళి కుటుంబం హీరోని కుటుంబం బాగా ఎంజాయ్ చేశారంటో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: