దక్షిణాది సూపర్ హిట్ చిత్రాలతో అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. తెలుగు, తమిళం భాషల లో ఎన్నో సినిమాల్లో నటించిన కీర్తి.. మహానటి సినిమా లో తన నటనకుగానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ సైతం అందుకుంది. ఇన్నాళ్లు సౌత్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. బీటౌన్ హీరో వరుణ్ ధావన్ జోడిగా బేబీ జాన్ అనే సినిమా లో నటించింది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది కీర్తి. ఇక పెళ్లైన మూడు రోజులకే ఈ సినిమా ప్రమోషన్ల లో పాల్గొంది. కానీ బేబీ జాన్ చిత్రం ఆశించిన స్థాయి లో ఆకట్టుకోలేకపోయింది.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అలాగే ఈసినిమాకు అంతగా వసూళ్లు సైతం రావడం లేదు. ఇదిలా ఉంటే.. బేబీ జాన్ సినిమా కోసం నిత్యం ముంబై లో సందడి చేస్తుంది కీర్తి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి అక్కడి ఫోటోగ్రాఫర్స్ ఆమెను కెమెరాల్లో బంధించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కొందరు ఫోటోగ్రాఫర్స్ ఆమెను కృతి అని పిలిచారు. దీంతో నాపేరు కృతి కాదు.కీర్తి అని చెప్పింది. అలాగే కీర్తి దోస అని పిలవడం పై అభ్యంతరం చెప్పింది కీర్తి. నాపేరు కీర్తి దోస కాదు.. కీర్తి సురేష్.. నాకు దోస అంటే చాలా ఇష్టమని చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.బేబీ జాన్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాకు డైరెక్టర్ అట్లీ నిర్మించారు. ఇందులో వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామిక గబ్బి ప్రధాన పాత్రలు పోషించారు. ఇందు లో జాకీ ష్రాఫ్ విలన్ గా నటించగా  డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: