టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు పొందిన పూరి జగన్నాథ్ ఈ ఏడాది విడుదల చేసిన డబల్ ఇస్మార్ట్  శంకర్ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది. గత కొద్ది రోజుల నుంచి ఎలాంటి సినిమాలను ప్రకటించకుండా ఉన్న పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయం పైన స్పందిస్తూ ఉంటారు. తాజాగా పూరి జగన్నాథ్ ఈ ఏడాది అయిపోతోంది న్యూ రిజల్యూషన్  గా సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నారట. అంతేకాకుండా దీనివల్ల విడాకులు కూడా పెరుగుతున్నాయంటూ వెల్లడించారు.



మొదటిసారి పూరి జగన్నాథ్ సోషల్ మీడియా వల్లే విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయని విషయాన్ని తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా మనం ఎలాంటి పని చేసిన కూడా ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టడం వల్లే చివరికి బెడ్ రూమ్ లో తింటున్నప్పుడు, ముద్దు పెట్టుకున్నప్పుడు డిజిటల్ ఆడిషన్స్ కి పెరిగిపోవడం వల్లే దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని వీటివల్ల బంధాలు కూడా దెబ్బతింటున్నాయని అంతటికీ కారణం సోషల్ మీడియా వల్ల విడాకులు అంటూ తెలియజేస్తున్నారు. మొదటిసారి విడాకుల పైన ఇలా ఇన్ డైరెక్ట్ గా మాట్లాడారేమో అన్నట్టుగా పూరి జగన్నాథ్ కనిపిస్తోంది.


మీరు రిలేషన్ షిప్ లో ఉన్న కొత్తగా పెళ్లయినా సరే దయచేసి ఎవరైనా సోషల్ మీడియాకు దూరంగా ఉండండి అని మీ పార్టనర్ నే ప్రపంచం అనుకొని జీవించండి.. మీరు ఆనందంగా ఉన్న.. బాధలో ఉన్నా కూడా ఎలాంటి పోస్టులు సోషల్ మీడియాలో పెట్టకండి ముఖ్యంగా అమ్మాయిలు ఇంస్టాగ్రామ్ మొత్తం మీ ఇంట్లో జరిగే విషయాలను సైతం ఎప్పుడు షేర్ చేసుకోవద్దు.. వివాహమైన వారందరూ కూడా సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే మీ జీవితాలు అంత బాగుంటాయి అంటూ పూరి జగన్నాథ్ తెలియజేయడం జరిగింది అందుకు సంబంధించిన ఒక ఆడియో కూడా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: