ప్రముఖ మ్యాజిక్ రియాల్టీ షో ఇండియన్ ఐడియాలో సందడి చేశారు బాలీవుడ్ అలనాటి నటి సంగీత బిజిలాని. ఇందులో ఆమె తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. సల్మాన్ ఖాన్ తో పెళ్లి గురించి గతంలో జరిగిన ప్రచారంపై ఎన్నో ఏళ్ల తర్వాత ఆమె పెదవి విప్పారు. సల్మాన్ ఖాన్ తో నా పెళ్లి జరగాల్సింది అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. అది నిజమే అని సంగీత చెప్పారు. దీని గురించి తను ఎక్కువగా మాట్లాడాలని అనుకోవడం లేదని ఆమె తెలిపారు. సంగీత వ్యాఖ్యలు షో లో పాల్గొన్న వారందరి నీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేశాయి. గతంలో ఇదే విషయాన్ని సల్మాన్ ఖాన్ కూడా మాట్లాడారు. తనకు పెళ్లి జరగవలసిందని .. శుభలేఖలు కూడా ముద్రించిన తర్వాత ఆగిపోయిందని చెప్పినా .. ఆ అమ్మాయి ఎవరు ? అనేది మాత్రం చెప్పలేదు. ఇదే కార్యక్రమంలో సంగీత తన మాజీ భాగస్వామి గురించి మాట్లాడారు.


అతడి ప్రవర్తన వల్ల తాను ఇబ్బంది పడినట్టు చెప్పారు. ఏదైనా మార్చుకునే అవకాశం వస్తే నా మాజీ భాగస్వామి జీవితాన్ని మారుస్తాం మొదట్లో మా మధ్య రిలేషన్ బాగా ఉండేది . . రాను రాను అతడు కండిషన్లో పెట్టడం మొదలు పెట్టాడు .. ఈ దుస్తులు వేసుకోవద్దు . . ఆ దుస్తులు వేసుకోవద్దు అంటూ సతాయించేవాడు అని చెప్పిన ఆమె అతడు ఎవరిని ? మాత్రం చెప్పలేదు. యోధ - విష్ణు దేవా - ఇజ్జత్ - గేమ్ లాంటి సినిమాల లో సంగీత నటించారు . ఆమె మోడల్గా రాణించిన సమయంలో సల్మాన్ ఖాన్ తో కలిసి పలు వాణిజ్య ప్రకటనల కోసం పనిచేశారు. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమాయణం మొదలయ్యింది .. అప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: