కాజల్ అగర్వాల్..ఒకప్పుడు తన అందం అభినయంతో కుర్ర కారు మతి పోగొట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పెళ్లై బాబు పుట్టాక తన అందం మొత్తం తగ్గిపోయింది అని చెప్పుకోవచ్చు.ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కాజల్ ఎలా ఉందో ప్రస్తుతం దానికి పూర్తి భిన్నంగా ఆమె రూపం మారిపోయింది. ఇక పెళ్ళై పిల్లలు పుట్టాక ఆడవాళ్ళ రూపం కచ్చితంగా చేంజ్ అవుతుంది. అందుకనే చాలామంది స్టార్ హీరోయిన్స్ ఎక్కడ అందం తరిగిపోతుందోనని పెళ్లయ్యాక పిల్లల్ని కనడానికి కాస్త ఆలోచన చేస్తారు.మరికొంత మందేమో సరోగసి ద్వారా పిల్లల్ని కంటే ఇంకొంతమంది ఏమో అవకాశాలు తగ్గాక పిల్లలకు ప్లాన్ చేసుకుంటారు.కానీ మాతృత్వం కంటే ఏది గొప్ప కాదు అనుకుందో ఏమో కానీ పెళ్లయిన రెండు సంవత్సరాలకే కాజల్ అగర్వాల్ బాబుకు జన్మనిచ్చింది. ఇక పెళ్లిని సీక్రెట్ గా చేసుకొని ఆ తర్వాత కొద్ది రోజులకి ఈ విషయాన్ని బయటపెట్టిన కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ విషయాన్ని మాత్రం దాచలేదు.

 ఇక పెళ్లయ్యాక కూడా కాజల్ అగర్వాల్ వరుస సినిమాలు చేసింది. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో అలాగే బాబు పుట్టాక కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లోనే ఉండేది. బాబు పుట్టి పెరిగి పెద్దవాడయ్యాక కొద్ది రోజులు బాబు అలనా పాలనా చూసుకొని ఆ తర్వాత మళ్లీ షూటింగ్స్ లో పాల్గొంది.అయితే పెళ్లయి బాబు పుట్టాక ఈమె చేసిన మోస్ట్ ఆఫ్ ది సినిమాలు ఫ్లాఫ్ లుగానే నిలిచాయి.ఇక పెళ్లై బాబు పుట్టాక అసలు కాజల్ అగర్వాల్ కి ఆఫర్స్ కూడా ఎక్కువగా రావడం లేదు. గత ఏడాది బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించినప్పటికీ ఈ సినిమాలో బాలకృష్ణ కూతురు పాత్రలో నటించిన శ్రీలీలకే క్రేజ్ దక్కింది.అలా శ్రీలీల ముందు కాజల్ అగర్వాల్ తేలిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్ అయినటువంటి భారతీయుడు 2 మూవీలో కూడా కాజల్ నటించింది.

ఈ సినిమాలో కూడా కాజల్ పాత్రకి అంతగా ప్రాధాన్యత లేదు. ఇక భారతీయుడు త్రీ మూవీలో కాజల్ పాత్ర ఎక్కువగా ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నప్పటికీ భారతీయుడు 2 సినిమానే డిజాస్టర్ అయింది. ఇక భారతీయుడు 3 సినిమా పై ఎలాంటి అంచనాలు లేవు.ఇక ఈ సినిమా తెరకెక్కుతుందో లేదో కూడా తెలియదు. ఇక సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ తో మన ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమాలో కాజల్ లుక్స్ చాలా దారుణంగా ఉండడంతో ట్రోలింగ్ జరిగింది. అలాగే ఒకప్పటి కాజల్ కి ఇప్పటి కాజల్ కే చాలా డిఫరెన్సెస్ వచ్చాయి అంటూ కాజల్ అగర్వాల్ పై ట్రోలింగ్ జరిగింది. అలా అందం అభినయం ఉన్నా కూడా కాజల్ అగర్వాల్ కి ఈ ఏడాది అంతగా కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది కాజల్ అగర్వాల్ నటించిన భారతీయుడు టు, సత్యభామ రెండు సినిమాలు అట్టర్ ఫ్లాపే అయ్యాయి. మరి 2025 లోనైనా కాజల్ అగర్వాల్ కి కలిసి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: