- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


2024లో నందమూరి బాలకృష్ణ నుంచి సినిమాలు ఏం రాలేదు .. ఈ విషయంలో బాలయ్య అభిమానులు కాస్త నిరు ఉత్సాహంగా ఉన్నారు. అయితే అన్‌స్టాప‌బు ల్ తో ఫ్యాన్స్ ని కాస్త సంతృప్తి పరిచారు. బాలయ్య అయితే 2025 సంక్రాంతి సీజన్ లో బాలయ్య హంగామా మొదలు కాబోతుంది. ఆయన డాకు మహారాజ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అవుతుంది .. ఇప్పటికే ప్రమోషన్లు మొదలైపోయాయి. ఈ సినిమా గురించి అటు నిర్మాత నాగ వంశీ - దర్శకుడు బాబి చాలా గొప్పగా చెబుతున్నారు. డాకూ మహారాజ్ సినిమాను ఇంతవరకు యాక్షన్ సినిమా గానే ప్రమోట్ చేస్తూ వచ్చారు. అయితే ఇందులో టెస్టులు త్రిల్లింగ్ ట్విస్టులు ఉండబోతున్నాయట. సినిమా మొత్తం మీద మూడు ట్విస్టులు ఉంటాయని .. అవన్నీ కథ‌ని కొత్త కోణంలో చూపించబోతున్నాయని తెలుస్తోంది.


ఈ సినిమాలో పాప ఎవరు అని అందరిలో ఉంది .. ఈ పాప ఎవరు అన్న విషయాన్ని రివిల్ చేయటమే ఈ సినిమాలో అతిపెద్ద ట్విస్ట్ అని సమాచారం. బాలయ్య పాత్రలో భిన్నమైన కోణాలు ఒక్కొక్కటిగా బయటకు రావ‌టం కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉండబోతుందట. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ టీజర్ తో పాటు రెండు పాట‌లు వచ్చాయి. మూడో పాట‌ జనవరి 4న రాబోతుంది  ... ఆ పాట మాస్ కు నచ్చేలా ఉండబోతుందని ... ఇందులో బాలయ్య వేసేటప్పుడు చాలా కొత్తగా ఉంటాయని తెలుస్తుంది. రెండు పాట‌ల లో బాలయ్య ఎనర్జీ చూసే అవకాశం రాలేదు. మూడో పాటలో ఆ లోటు తీరబోతుందని తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ బాలీవుడ్ ఐటెం గార్ల్‌ ఊర్వసి రౌతేలా బాలయ్యతో ఆడి పాడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: