టాలీవుడ్ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించడం అంటే సులువైన విషయం కాదు. అయితే రకుల్ మాత్రం ఒకానొక దశలో వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా సత్తా చాటడంతో పాటు ప్రశంసలు అందుకున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీలకు జోడీగా నటించిన రకుల్ భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు. అయితే స్పైడర్, మన్మథుడు2 సినిమాలు మాత్రం రకుల్ కెరీర్ కు భారీ దెబ్బ కొట్టాయి.
 
ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఈ సినిమాల తర్వాత రకుల్ కు కొత్త మూవీ ఆఫర్లు రావడం కూడా కష్టమవుతోంది. సీనియర్ హీరోలు రకుల్ కు ఛాన్స్ ఇస్తే ఈ బ్యూటీ కెరీర్ పుంజుకుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత సినిమాలతో సైతం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
 
రకుల్ ప్రీత్ సింగ్ రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉందని తెలుస్తోంది. 2025 సంవత్సరం రకుల్ ప్రీత్ సింగ్ కు భారీ విజయాన్ని అందించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సరైన రీతిలో రకుల్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే ఆమె ఖాతాలో మరిన్ని విజయాలు చేరడం పక్కా అని చెప్పవచ్చు. కెరీర్ విషయంలో రకుల్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.
 
రకుల్ ప్రీత్ సింగ్ రేంజ్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సరైన ప్రాజెక్ట్ తో రీఎంట్రీ ఇస్తే రకుల్ ఖాతాలో మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లు చేరడం పక్కా అని చెప్పవచ్చు. రకుల్ ప్రీత్ సింగ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఆమె అభిమానులు ఫీలవుతున్నారు. రకుల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రకుల్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.


 


మరింత సమాచారం తెలుసుకోండి: