టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిట్టు అలాగే ప్లాప్ అనే తేడాలు లేకుండా... మంచి కథ వస్తే కచ్చితంగా సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. అయితే 2024లో మాత్రం... ప్రేక్షకులను అలరించలేకపోయింది హీరోయిన్ నిత్యామీనన్. ఈ సంవత్సరంలో... దాదాపు మూడు ప్రాజెక్టులకు... గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ బ్యూటీ. అయితే ఇందులో ఒకే ఒక్క సినిమా రిలీజ్ అయింది.

 

ఆ సినిమానే రాయన్. హీరో ధనుష్ చేసిన సినిమానే ఈ రాయన్. ఈ సినిమా లో హీరోయిన్ నిత్యామీనన్ కీలక పాత్రలో కనిపించారు. కానీ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ఈ సంవత్సరంలో నిత్యామీనన్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అలాగే కదలిక్క నేరమిళ్ళై, డియర్ ఎక్సైస్ అనే రెండు ప్రాజెక్టులకు ఈ సంవత్సరంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హీరోయిన్. అయితే ఈ రెండు సినిమాలు కూడా... షూటింగ్ దశలోనే ఉన్నాయి.

 

ఈ సినిమాలు వచ్చే సంవత్సరం చివర్లో లేదా మధ్యలో రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇక తెలుగులో మాత్రం ఈ బ్యూటీ ఎక్కడ సినిమా చేయలేదు. మన తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ల విపరీతంగా ఉన్న నేపథ్యంలో నిత్యామీనన్ ను పట్టించుకునే నాధుడే లేడు. అప్పుడెప్పుడో భీమ్లా  నాయక్ సినిమా తర్వాత... అసలు తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు ఛాన్సులు ఇచ్చే నాధుడే లేకుండా పోయాడు.

 

దాదాపు మూడేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది నిత్యామీనన్. అయితే ఫ్యూచర్లో అయినా... తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తే బాగుంటుందని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి నిత్యమీనన్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో చూడాలి. మొత్తానికి అయితే 2024లో మాత్రం... ఆమె ఫ్యాన్స్ కు నిరాశ ఎదురు అయిందని చెప్పవచ్చు. కాగా కర్ణాటక కు చెందిన ఈ బ్యూటీ 1998 సంవత్సరంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్.

మరింత సమాచారం తెలుసుకోండి: