టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏటా తమ అందచందాలతో సినీ ప్రియులను అలరించే పలువురు హీరోయిన్లు 2024లో బిగ్ స్క్రీన్ మీద కనిపించలేదు. చేతి నిండా ప్రాజెక్ట్స్ తో ఏడాది పొడవునా బిజీగా ఉన్నప్పటికీ, అనుకున్న విధంగా సినిమాలు విడుదల అవ్వకపోవడంతో ఈ సంవత్సరం సందడి చేయలేకపోయారు. అలాంటి వారిలో మెహరిన్ ఒకరు.మెహ్రీన్ ఫిర్జాదా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు.పంజాబ్ కు చెందిన మెహ్రీన్ పదేళ్లకే ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకుంది. 2013లో టొరంటోలో జరిగిన మిస్ పర్సనాలిటీ సౌత్ ఆసియా కెనడా పోటీలో విజేత గా నిలిచింది. ఆ తర్వాత కొన్ని కమర్షియల్ యాడ్స్ లో నటించింది.ఆ తరువాత న్యాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ..ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.

ముఖ్యంగా  ఎఫ్ 2 సినిమాలో ‘హనీ ఈజ్ ది బెస్ట్’ అంటూ మెహ్రీన్ చెప్పిన క్యూట్ డైలాగ్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది.కానీ ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం రాలేదు. కానీ తెలుగులో అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాల్లో నటించినా.. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోయే పాత్రలలో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం చేసుకుంది. కానీ వీరి బంధం పెళ్లికి ముందే ముక్కలయ్యింది. తమ పెళ్లి రద్దు అయినట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇక అప్పటినుంచే మెహ్రీన్ సినిమాలు కూడా బోల్తా కొట్టాయి.ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయిన మెహ్రీన్ ఎఫ్ 3 మూవీతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది.అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఓటీటీలో పలు వెబ్ సిరీస్ చేసింది మెహ్రీన్.గ‌త సంవ‌త్స‌రం స్పార్క్ అనే ఓ తెలుగు సినిమాలో క‌నిపించిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ సుల్తాన్ అనే ఓ హిందీ వెబ్ సిరీస్‌లో కాస్త హ‌ద్దులు దాటి రెచ్చిపోయింది.ఈ సంవత్సరం  ఓ క‌న్న‌డ చిత్రం త‌ప్పితే అమ్మ‌డి చేతిలో మ‌రో సినిమా లేక పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ యేడాదైనా అవ‌కాశాలు ప‌ల‌క‌రిస్తాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: