"బాలయ్య" అన్న పేరు వినపడగానే అందరికీ బాడీలో ఒక తెలియని షివరింగ్ వస్తూ ఉంటుంది . బాలయ్య అంటే అందరికీ కూడా కోపం ఎక్కువ అన్న విషయమే గుర్తొస్తుంది . కానీ బాలయ్యలో చాలా చాలా మంచి తనం ఉన్న మనిషి కూడా ఉన్నాడు . ఆ విషయం ఆయన స్నేహితులకి .. ఆయన శ్రేయోభిలాషులకు.. ఆయనను దగ్గర నుంచి గమనించే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది . నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . నటనకు నటన ..అందానికి అందం ..కోపానికి కోపం.. మంచితనానికి మంచితనం.. అన్నీ కూడా సమపాలనలో ఉంటాయి.


అయితే బాలయ్య ఎవరికీ హెల్ప్ చేయరు అని ..దానధర్మాలు అస్సలు చేయడు అని .. ఆయన స్వార్ధంగా ఉంటాడు అని..పొలిటీకల్ పరంగా మాత్రమే ఫండ్స్ ఇస్తారు తప్పిస్తే ఎక్కద కూడా పరసనల్ గా ఆయన హెల్ప్ ఎవ్వరికి చేయడు అని..చాలా రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎప్పటినుంచో కొన్ని వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి . అయితే బాలయ్య పైకి కనిపించే అంత కోపంగా కఠినంగా అస్సలు ఉండరట . ఇదే విషయాని నందమూరి ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.



మరీ ముఖ్యంగా ఎవరైనా పిల్లలు రోడ్డు పక్కన భిక్షాటన చేస్తూ ఉన్న.. లేదా చిన్న పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉన్నా ..ఆ దృష్టి బాలయ్య వద్దకు వస్తే మాత్రం వాళ్ల సహాయం అడగకుండానే హెల్ప్ చేసేస్తాడట. అంత మంచి మనసు బాలయ్యది. అయితే తప్పు చేస్తే మాత్రం ఎవరికైనా సరే స్పాట్లోనే తాట తీసేస్తాడట . అది కుటుంబ సభ్యులైన వేరే వ్యక్తులైన .. ఎవరైనా తప్పు చేస్తే వాళ్లకు స్పాట్లోనే పనిష్మెంట్ ఇవ్వడం బాలయ్యకు మొదటి నుంచి అలవాటు.ఇండస్ట్రీలో బాలయ్య ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో అందరికీ తెలుసు . మరీ ముఖ్యంగా బాలయ్య నటించిన "డాకు మహారాజ" సినిమాతో ఇండస్ట్రీ చరిత్రను తిరగరాయబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.  ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోస్ నటించిన సినిమాలు  ఏవి కూడా 100 కోట్లు క్రాస్ అవ్వడం లేదు . కానీ బాలయ్య నటించిన సినిమాలు మాత్రం బ్యాక్ టు బ్యాక్ అన్నీ కూడా 100 కోట్లు క్రాస్ అయిపోతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: