బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ మాలియక్కల్ కావ్య శ్రీ ముందే యస్మితో డాన్స్ చేశాడు. ఇటీవల స్టార్ మా పరివారం కార్యక్రమంలోకి నిఖిల్, కావ్య, యస్మి వచ్చారు. అయితే పరివారం షో యాంకర్ శ్రీముఖి ఏ వచ్చి బీపై వాలే.. బీ వచ్చీ సీపై వాలిందే అనే సాంగ్ బిగ్ బాస్ సీజన్ 8లో బాగా వినిపించిందని.. ఏ ఎవరో బీ ఎవరో నాకు తెలియదు అని శ్రీముఖి అంటుంది. దానికి అవినాష్, రోహిణిలు పృథ్వీకి బాగా తెలుసు అని సమధానం ఇస్తారు. దాంతో వెంటనే శ్రీముఖి అయితే ఆ పాటకి నిఖిల్, యస్మిలు పెర్ఫామ్ చేస్తే చూడాలని అనిపిస్తుందని చెప్తుంది. దీంతో యస్మి, నిఖిల్ ఆ పాటకి డాన్స్ చేశారు. అది చూసిన కావ్య మొహం తిప్పేసుకుంది. ప్రేమించినవాడు మరో అమ్మాయితో డాన్స్ చేస్తుంటే ఏ అమ్మాయి అయిన చూసి తట్టుకోలేదు అంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇక వీరిద్దరి ప్రేమ యవ్వారం ఎక్కడి దాకా వస్తుందో చూడాలి.
ఇక పోతే నిఖిల్ లవ్ లైఫ్ విషయానికి వస్తే.. నిఖిల్ హీరోగా నటించిన గోరింటాకు సీరియల్ లో హీరోయిన్ రోల్ చేసిన కావ్య శ్రీతో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. అయితే నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్ళే ముందు వారికి గొడవ అయిందని సమాచారం. నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లక బయట నాకు వేరే ఉన్నారని.. బ్రేకప్ అయిందని నిఖిల్ అన్నాడు. బిగ్ బాస్ నుండి బయటికి వెళ్లిన తర్వాత తనని కలుస్తానని, తనపై ఉన్న ప్రేమని మళ్లీ వ్యక్తపరుస్తానని ఎమోషనల్ అయ్యాడు. కానీ నిఖిల్ హౌస్ నుండి బయటికి వచ్చి రోజులు గడిచాయి కానీ తాను కావ్య శ్రీ కలవడానికి వెళ్లలేదు.
నిఖిల్ స్టార్ మా లో ప్రసారం అయ్యే గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి అందరి మనసు దోచుకున్నాడు. ఆయన నటనతో తెలుగు వారిని కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు. అంతేకాదు నిఖిల్ స్టార్ మాలో ప్రసారమయ్యే ప్రతి షోలో పాల్గొనేవాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో ఆఫర్ రావడంతో మొదటి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. తన మాట, ఆటతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకున్నాడు. నిఖిల్ కి మాత్రమే సీజన్ 8 విన్నర్ అయ్యే అర్హత ఉందని ప్రేక్షకుల అందరి నోట అనిపించుకున్నాడు. ఈ సీజన్ లో 22 మంది దాటుకొని 105 రోజులు బిగ్ బాస్ హౌస్ లో జర్నీ చేసి గెలిచాడు. రూ. 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు మారుతీ లగ్జరీ కారుని కూడా బహుమతిగా పొందాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: