•డైరెక్టర్ వల్లే సంయుక్త కి ఆఫర్స్..

•ఇలాంటి రూమర్స్ భరించలేక ఇండస్ట్రీకి దూరం

•వచ్చే యేడాది వరుస సినిమాలతో జోరు చూపించనున్న బ్యూటీ..

ఈ మధ్యకాలంలో మలయాళ ఇండస్ట్రీ నుంచి చాలామంది తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అవుతున్నారు. అలాంటి వారిలో సంయుక్త మీనన్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ మొదటిసారి పాప్ కార్న్ అనే సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సంయుక్త తెలుగులో మాత్రం భీమ్లా నాయక్ సినిమాలో నటించినది. ఈ సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న సంయుక్త.. బింబిసారా, సార్, విరూపాక్ష వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నది. అయితే 2024 లో మాత్రం ఏ ఒక్క సినిమాను విడుదల చేయలేదు.  దీంతో అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు.


సంయుక్త మీనన్ ఈ ఏడాది సినిమాలు విడుదల చేయకపోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే, తను వివాహం చేసుకుంటుందని రూమర్స్ వినిపించడమే కాకుండా టాలీవుడ్ లో ఒక టాప్ డైరెక్టర్ వల్లే తనకు అవకాశాలు వస్తున్నాయని రూమర్స్ వినిపించడంతో ఈ విషయాలు తనను చాలా బాధకి గురి చేశాయట. అంతేకాకుండా సంయుక్త ఒక సర్జరీ కూడా ఫేస్ కి చేయించుకున్నట్లు రూమర్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి రూమర్స్ వల్లే సంయుక్త కాస్త డిప్రెషన్ కి గురైందని సమాచారం.


అందుకే సంయుక్త కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ అన్నిటికీ చెక్ పెట్టాలనే విధంగా ఆలోచించి మరీ సినిమా కథలను ఎంపిక చేస్తోందట.  ప్రస్తుతం స్వయంభూ,BSS 12, శర్వానంద్ తో ఒక సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.2025 లో  సంయుక్త మీనన్ వరుసగా సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు తెలుగులో సంయుక్త నటించిన చిత్రాలు ఫ్లాప్ కాలేదు. అందుకే  లక్కీ హీరోయిన్గా పేరు సంపాదించింది. మరి తన మార్కుని ఏడాది పలు రకాల రూమర్స్ వల్ల క్రేజ్ తగ్గించుకున్నప్పటికీ వచ్చే ఏడాది అయినా తన క్రేజ్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తుందేమో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: