2025 సంక్రాంతికి టాలీవుడ్ నుంచి చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. అలా బాలకృష్ణ నటించిన డాకుమహారాజు సినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ బాబి కొల్ల దర్శకత్వం వహించక నిర్మాతగా నాగవంశీ ఉన్నారు.ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్లో నిర్మాత నాగ వంశి మాట్లాడిన మాటలను బట్టి చూస్తే ఈ సినిమా ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. తమన్ ఈ సినిమాకి మరొకసారి అద్భుతమైన సంగీతాన్ని కూడా అందించాలని దర్శక నిర్మాతలు కూడా తెలియజేస్తున్నారు.


నిర్మాత నాగవంశి ఇప్పుడే డాకు మహారాజ సినిమా స్కోరును చూశాను ఈ స్కోర్ ని బట్టి చూస్తే కచ్చితంగా థియేటర్లో ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ అంటూ ఫైర్ బ్లాస్ట్ ఎమోజీలను కూడా షేర్ చేయడం జరిగింది. జనవరి 12వ తేదీ వరకు అభిమానులు వెయిట్ చేయండి ఎవరు ఊహించని విధంగా.. తమన్ బ్రదర్ బ్లాక్ బాస్టర్ స్కోర్ డెలివరీ చేశాడని తెలియజేశారు నిర్మాత నాగవంశీ. బాలయ్య థియేటర్లో శివతాండవమే అని సితార ఎంటర్టైన్మెంట్ అధినేత నాగవంశి కూడా తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు.



దీంతో బాలయ్య అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.బాలయ్యకు జోడిగా ప్రఖ్యా జైస్వాల్ నటిస్తూ ఉండగా. మరొక హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ కూడా నటిస్తూ ఉన్నారు. వీరిద్దరికి సంబంధించి ఇందులో క్యారెక్టర్లు హైలైట్ గా ఉంటాయని అలాగే స్పెషల్ సాంగులు ఊర్వశి రౌతేలా నటిస్తోంది బాబి డియోల్ విలన్ గా నటిస్తూ ఉండగా చాందిని చౌదరి కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే తదితర నటీనటులు సైతం ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. మొత్తానికి నాగవంశీ తెలియజేసిన ఈ ఫస్ట్ రివ్యూ అభిమానులను ఎగ్జైటింగ్ అయ్యేలా చేస్తోంది. మరి పూర్తి బొమ్మ బ్లాక్ బాస్టర్ గురించి తెలియాలి అంటే జనవరి 12 వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: