చాలామంది సెలబ్రిటీలకు వింత వింత వ్యాధులు ఉంటాయి.అలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు తమకు ఉన్న వింత వ్యాధుల గురించి బయటపెట్టారు. రీసెంట్గా రష్మిక మందన్నా కూడా తనకి పైకి ఎవరైనా ఎత్తుకుంటే కళ్ళు తిరిగినట్టు అవుతాయని, నాకు అది ఓ జబ్బు లాంటిది అంటూ సీక్రెట్ విషయాన్ని బయట పెట్టింది.అయితే తాజాగా రాంచరణ్ కి కూడా అలాంటిదే ఒక వ్యాధి ఉంది అంటూ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు జూనియర్ ఎన్టీఆర్.ఇక జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ మధ్య బంధం ఎలాంటిదో చెప్పనక్కర్లేదు. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. వీరి మధ్య స్నేహం కాదు స్నేహం కంటే మించి వీరి మధ్య బంధం ఉంది. ఇక ఆ మంచి బాండింగ్ కారణంగానే వీరిద్దరి కాంబినేషన్లో ఆర్ఆర్ఆర్ అనే మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ వచ్చిన సంగతి కూడా తెలిసిందే.

సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు.అయితే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతుండగా రామ్ చరణ్ గురించి ఓ సంచలన విషయాన్ని బయట పెట్టారు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పలేదు.గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ అప్పటి విషయం మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ సమయంలో బయటపడింది. మరి ఇంతకీ రామ్ చరణ్ కి ఉన్న వ్యాధి ఏంటయ్యా అంటే మతిమరుపు.. అవును ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ కి ఉన్న అతిపెద్ద వ్యాధి మతిమరుపు.. ఆయన ఏదైనా సరే తొందరగా మరచిపోతూ ఉంటాడు..

ముఖ్యంగా షూటింగ్ సెట్లో పని చేసే వారి పేర్లు ఎన్నిసార్లు చెప్పినా మరిచిపోతారు. షూటింగ్ సెట్ లో పనిచేసే చాలా మంది రాంచరణ్ కి ఎన్నిసార్లు తమ పేర్లు చెప్పినా మరిచిపోయి మళ్ళీ వారిని వేరే వాళ్ళ పేరుతో పిలుస్తారు. అలా పేర్ల విషయంలో చాలాసార్లు రాంచరణ్ మర్చిపోయి కన్ఫ్యూజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలా రామ్ చరణ్ కి ఉన్న బలహీనత మతిమరుపు ఒక్కటే..అంటూ ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.అయితే ఈ మాటలు విన్న యాంకర్ మరి నా పేరు గుర్తుందా అని అడగగా షాక్ అయినా చరణ్ తెలియనట్లుగా ఫేస్ పెట్టాడు. దీంతో రామ్ చరణ్ యాంకర్ పేరు మర్చిపోయి అడ్డంగా బుక్ అయ్యాడు. కానీ దీన్ని మాత్రం తొందరగా కవర్ చేసుకోని ఒక నవ్వు నవ్వాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: